అది ప్యాంట్రీ కార్‌.. బే‘కార్‌’ రాతలేల రామోజీ 

28 Mar, 2024 05:22 IST|Sakshi

బస్సుయాత్ర కోసం వంట సామాన్లను తీసుకెళ్లిన ప్యాంట్రీ వాహనం 

సీఎం క్యాంప్‌ కార్యాలయానికి కంటైనర్‌ ఎందుకొచ్చిందంటూ ఈనాడు తప్పుడు రాతలు   

నిషేధిత ప్రాంతంలో ఫొటోలు.. వీడియోలు తీసి అడ్డగోలు కూతలు 

అనుమతి లేకుండా చిత్రీకరించడమే కాకుండా వక్ర రాతలు రాసిన ఈనాడు, ఈటీవీపై చట్టపరమైన చర్యలకు అధికారులు సిద్ధం   

వేంపల్లెలో డీజిల్‌ కొట్టించుకుని ఆళ్లగడ్డకు చేరుకున్న ఏపీ 16 జెడ్‌ 0363 వాహనం.. సీఎం జగన్‌ బస చేసే ప్రాంతంలోనే పార్కింగ్‌  

సాక్షి,అమరావతి/సాక్షి, నంద్యాల: 2024 మే 13న జరిగే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని,  జూన్‌ 4న జరిగే ఓట్ల లెక్కింపులో వైఎస్సార్‌ సీపీ విజయఢంకా మోగించనున్నదన్న స్పష్టమైన సంకేతాలు ఈ­నాడు రామోజీరావుకు అందాయి. బయట సర్వే­లే కాదు.. స్వయంగా ఈనాడు, ఈటీవీ కంట్రిబ్యూటర్లు నిర్వహించిన సర్వేలోనూ ఎంత తక్కువ అనుకున్నా వైఎస్సార్‌ సీపీ 150 సీట్లపై మాటే కైవసం చేసుకుంటుందని తేలడంతో ఈనాడు రామోజీ­రా­వు­కు నిద్రపట్టడం లేదు. చంద్రబాబు కన్నా ముందే ఆయన భయంతో వణికిపోతున్నారు. ఉచ్ఛనీచాలు మరిచి కథనాలు రాస్తున్నారు.

పైత్యం ఎక్కువై ఏమీ లేకున్నా.. అక్కడేదో ఉన్నట్లు, ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయిందన్నట్టుగా ప్రజలను మభ్యపె­ట్టేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దు­ష్ప్రచారమే లక్ష్యంగా ఊహాగానాలతో అసత్యాలు అల్లుకుని యథేచ్ఛగా వార్తలు రాస్తున్నారు. ఇలాంటి పై­త్యపు రాతలతో రామోజీ కడుపు మంట తీరుతుందేమోగానీ, అవాస్తవాలను వాస్తవం అంటూ ప్రజల్ని మోసం చేయలేరు. సీఎం క్యాంపు కార్యాలయానికి ఈ కంటెయినర్‌ ఎందుకొచ్చింది? ఏం తె­చ్చింది? అంటూ బుధవారం ఈనాడు కట్టుకథను అల్లింది.  

ప్యాంట్రీ కార్‌.. కంటెయినర్‌లా కనిపించిందా?
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం పే రుతో బస్సుయాత్రను బుధవారం ఇడుపులపాయ నుంచి ప్రారంభించారు. ఈ యాత్రలో భాగంగా దాదాపు మూడు వారాల (21రోజులు)పాటు ప్రజ­లో­నే ఉండనున్నారు. దీంతో ముఖ్యమంత్రి కోసం ఆహారాన్ని వండేందుకు ఏపీ 16 జడ్‌ 0363 నంబర్‌ గల ప్యాంట్రీ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ వాహనం మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వంటసామాన్లు తీసుకొచ్చింది. వాహనంలో వాటర్‌ బాటిళ్లు, వంటకు అవసరమైన కూరగాయలు, వంట సామగ్రి మాత్రమే ఉన్నాయి.

ఈ వాహనం మంగళవారం తాడేపల్లి నుంచి బుధవారం ఉదయానికి వైఎస్సార్‌ జిల్లా వేంపల్లె మండలానికి చేరుకుంది. అక్కడే డీజిల్‌ కొట్టించుకుని సీ­ఎం వైఎస్‌ జగన్‌ బస చేయనున్న ఆళ్లగడ్డకు మధ్యాహ్నానికి చేరుకుంది. చిన్నసైజులో ఉన్న ఈ ప్యాంట్రీ వాహనం ఈనాడుకు, రామోజీరావుకు ఓ పెద్ద కంటెయినర్‌గా కనిపించింది. అంతే ఈ కంటెయినర్‌ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎందుకు వచ్చింది, ఏమి తెచ్చింది.. అంటూ నిస్సిగ్గుగా ఉన్మాదపు రాతలను ఆ పత్రిక అచ్చేసింది.

క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్‌ నుంచి ఈటీవీ ప్రతినిధి ప్యాంట్రీ వాహనం విజువల్స్, ఫొటోలు తీసినట్టు సీసీ­టీ­వీ ఫుటేజీ ద్వారా క్యాంపు కార్యాలయ భద్రతా సి­బ్బం­ది గుర్తించారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో అనుమతి లేకుండా ఫొటోలు.. వీడియోలు తీయ­డం నిషిద్ధం. ఇది తెలిసినా ఈనాడు పత్రిక నిబంధనలు మీరి ఫొటోలు, వీడియోలు తీయడమే కాకుండా అడ్డగోలు రాతలు రాసింది. దీనిపై ఉన్నతాధికా­రులు సీరియస్‌ అయ్యారు. ఈనాడు, ఈటీవీపై చట్ట­పరమైన చర్యలకు సిద్ధమయ్యారు. కనీసం క్రాస్‌ చెక్‌ చేసుకోకుండా, అధికారులెవరినీ వివరణ అడగకుండా బురద జల్లేలా రాసిన రాతలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.

సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌
ఒక వార్త రాసేముందు ఒకటికి రెండు సార్లు క్రాస్‌ చెక్‌ చేసుకోవడం జర్నలిస్టు విధుల్లో ఓ భాగం. కానీ, ఈనాడు అత్యుత్సాహానికి పోయి ఊహలతో అబద్ధాలు ప్రచురించింది. దీంతో ప్యాంట్రీ వాహనంలో ఏముందో సోషల్‌ మీడియాలో వైఎస్సార్‌ సీపీ ఫొటోలతో సహా బహిర్గతం చేసింది. దీంతో ఈనాడు పరువు పోయింది. ఇవేం రాతలంటూ ఆ పత్రికను ట్రోలర్స్‌ ఓ ఆట ఆడుకుంటున్నారు.  

బెడిసికొట్టిన లోకేశ్‌ అతి 
టీడీపీ నేత నారా లోకేశ్‌కు తరచూ అభాసుపాలవ్వడం రివాజుగా మారింది. బుధవారమూ రొటీన్‌గా తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ‘‘నిబంధనలు అతిక్రమించి సీఎం జగన్‌ ఇంట్లోకి వెళ్లిన కంటెయినర్‌ను ఎందుకు తనిఖీ చేయలేదు’ అంటూ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. దీనికి ఈనాడు క్లిప్పింగ్‌ను జత చేశారు. అయితే వెంటనే స్పందించిన సోషల్‌ మీడియా లోకేశ్‌ను రీట్వీట్‌లతో ఓ ఆట ఆడుకుంది. వాహనంలో ఉన్న వస్తువులతోపాటు వాహన వివరాలన్నీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అతి చేద్దామనుకున్న ఆయన వ్యూహం బెడిసికొట్టింది. 

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers