వాట్సప్‌ స్టేటస్‌ పెడుతున్నారా..? అదిరిపోయే అప్‌డేట్‌ మీ కోసమే!

21 Mar, 2024 09:43 IST|Sakshi

మెటా ఆధ్వర్యంలోని వాట్సప్‌ తన వినియోగదారులకు అదిరిపోయే అప్‌డేట్‌ ఇవ్వబోతున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఆ కథనాల ప్రకారం..ఇకపై 60 సెకన్ల నిడివితో ఉన్న వీడియోలను సైతం వాట్సప్‌ స్టేటస్‌లో అప్‌లోడ్‌ చేసే అవకాశాన్ని కల్పించనున్నట్లు సమాచారం.

వాట్సప్‌ స్టేటస్‌లో ప్రస్తుతం గరిష్ఠంగా 30 సెకన్ల నిడివి ఉన్న వీడియోలను మాత్రమే పోస్ట్‌ చేసేందుకు అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ నిడివిఉన్న వీడియోలను నేరుగా పంపించాల్సిందే. స్టేటస్‌లో పెట్టుకునేందుకు అవకాశంలేదు. ఒకవేళ అలా స్టేటస్‌లో పెట్టాలంటే మరో వీడియో కింద మార్చిపెట్టాలి. వీడియో నిడివి పెరుగుతున్న కొద్దీ స్టేటస్‌ అప్‌డేట్ల సంఖ్య పెరుగుతుంది. దీన్ని పరిష్కరించేందుకు వాట్సప్‌ తాజా అప్‌డేట్‌ను తీసుకొస్తున్నట్లు తెలిసింది.

ఒ‍క నిమిషం నిడివితో ఉన్న వీడియోలను స్టేటస్‌లో అప్‌లోడ్‌ చేసే అవకాశం ఉండబోతుందంటూ సమాచారం. ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. త్వరలో మిగిలిన యూజర్లందరికీ ఇది అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి: 23 ఏళ్ల గరిష్ఠానికి చేరిన కీలక వడ్డీరేట్లు.. తగ్గింపు ఎప్పుడంటే..

ఇదిలాఉండగా, పేమెంట్స్‌కు సంబంధించి వాట్సప్‌ మార్పు చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం వాట్సప్‌లో చెల్లింపులు చేయాలంటే త్రీ డాట్స్‌ మెనూలో పేమెంట్స్‌లోకి వెళ్లాల్సి వస్తోంది. ఇకపై ఆ అవసరం లేకుండా మనం ఎంచుకున్న కాంటాక్ట్‌ చాట్‌లోనే పై భాగంలో క్యూఆర్‌ కోడ్‌ సింబల్‌ ఉంటుంది. దానిపై క్లిక్‌ చేసి పేమెంట్‌ చేయొచ్చు. ఈ ఫీచర్‌ కూడా త్వరలో అందుబాటులోకి రానుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

Election 2024

మరిన్ని వార్తలు