రణపాలతో ఆరోగ్య ప్రయోజనాలు : పేరులోనే ఉంది అంతా!

28 Mar, 2024 14:05 IST|Sakshi

ప్రకృతిలో వెదికి పట్టుకోవాలనే గానీ  ఎన్నో ఔషధ మొక్కల నిలయం. సౌందర్య పోషణ దగ్గర్నించి, దీర్ఘకాల రోగా వలరు ఉన్నో ఔషధ గుణాలున్న మొక్కలు మన చుట్టూనే ఉన్నాయి. అలాంటి వాటిలో రణపాల ఒకటి.

వాస్తవానికి రణపాల అలంకరణ మొక్కగా భావిస్తాం. కానీ ఆరోగ్య ప్రయోజనాలు కూడాచాలానే ఉన్నా యంటున్నారు  ఆయుర్వేద నిపుణులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 వ్యాధులను నయం చేయగల శక్తి రణపాల మొక్కకి ఉంది.

ర‌ణ‌పాల శాస్త్రీయ నామం Bryophyllum pinnatum. దీని ఆకులు కాస్త మందంగా ఉంటాయి.  రుచి  కొద్దిగా  వ‌గ‌రు, పులుపు సమ్మిళితంగా ఉంటుంది. ఆకు నాటడం ద్వారానే మరో  మొక్కను అభివృద్ది చేసుకోవచ్చు. అంటే ఇంటి ఆవ‌ర‌ణ‌లో సుల‌భంగా పెంచుకోవ‌చ్చన్నమాట. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్,యాంటీ హిస్టామైన్ తోపాటు అనాఫీలాక్టిక్ గుణాలు రణపాలలో అధికంగా  ఉన్నాయి

రణపాల ప్రయోజనాలు 
ఆకు తినడం ద్వారా గానీ,  కషాయం తయారు చేసి తీసుకోవడం ద్వారా,  ఆకు  పేస్ట్‌ను కట్టు కట్టడం ద్వారా గానీ చాల ఉపయోగాలను పొందవచ్చు.
అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
డయాబెటిస్ ని క్రమబద్దీకరిస్తుంది.
 కిడ్నీ స‌మ‌స్య‌లు తగ్గుతాయి.  కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి. ఈ ఆకుల‌ను తింటే ర‌క్తంలోని క్రియాటిన్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.
జీర్ణాశ‌యంలోని అల్స‌ర్లు త‌గ్గుతాయి. అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు
 ఆకులని వేడిచేసి గాయాలపై పెడితే  గాయాలు త్వరగా మానుతాయి
 ఆకులని నూరి దాన్ని తలపై పట్టులా వేస్తే  తల నొప్పి తగ్గుతుంది.
రోజు ఈ ఆకుల్ని తినడం ద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది. తెల్ల వెంట్రుక‌లు రావ‌డం ఆగుతుందట
ఈ ఆకుల్లో యాంటీ పైరెటిక్ ల‌క్ష‌ణాలు  జ‌లుబు, ద‌గ్గు, విరేచ‌నాల‌ను న‌యం చేస్తాయి.
మ‌లేరియా, టైఫాయిడ్ జ్వ‌రాలు వ‌చ్చిన వారు తీసుకుంటే మంచిది. 
 ర‌ణ‌పాల ఆకుల‌ను తిన‌డం వల్ల హైబీపీ త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రంలో ర‌క్తం, చీము వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.
కామెర్లతో బాధపడేవారు రోజూ ఉద‌యం, సాయంత్రం ఈ ఆకుల ర‌సాన్ని తీసుకుంటే వ్యాధి న‌యం అవుతుందని ఆయుర్వేదం చెబుతుంది.

నోట్‌:  ఈ చిట్కాలను  పాటించేటపుడు, రెగ్యులర్‌గా సంప్రదించే డాక్టర్‌, ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. 

Election 2024

మరిన్ని వార్తలు