Biggest Library: ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ ఎక్కడుంది?

28 Mar, 2024 13:18 IST|Sakshi

పుస్తకాలు చదవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుందంటారు. పుస్తకాలు ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతాయని కూడా చెబుతారు. పుస్తకాలు మనకు తెలియని ఎన్నో విషయాలను నేర్పుతాయి. అలాంటి పుస్తకాలకు నిలయం లైబ్రరీ. మరి ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ ఎక్కడుంది? 

పుస్తకాలు మనిషికి  మంచి మిత్రుని లాంటివని పెద్దలు చెబుతుంటారు. ఒంటరితనాన్ని పోగొట్టే దివ్య ఔషధం పుస్తకమేనని కూడా అంటారు. నచ్చిన పుస్తకాలను చదివేందుకు పుస్తకప్రియులు లైబ్రరీకి వెళుతుంటారు. కొంతమంది లైబ్రరీలో గంటల తరబడి ఉండేందుకు ఇ‍ష్టపడతారు. మన దేశంలో  లైబ్రరీలు చాలానే ఉన్నాయి. 

ప్రపంచంలోనే అతి పెద్ద లైబ్రరీ ఇంగ్లండ్‌ రాజధాని లండన్‌లో ఉంది. దీనిని బ్రిటిష్ లైబ్రరీ అని పిలుస్తారు. ఇక్కడ దాదాపు 20 కోట్ల పుస్తకాలు, ఇతర పత్రాలు ఉన్నాయి. ఈ లైబ్రరీ  1973, జూలై ఒకటిన నెలకొల్పారు. ఈ లైబ్రరీ గతంలో బ్రిటిష్ మ్యూజియంలో భాగంగా ఉండేది. ఈ లైబ్రరీకి వెళ్లి ఎవరైనా అక్కడి పుస్తకాలు చదువుకోవచ్చు. 

Election 2024

మరిన్ని వార్తలు