గ్రహం అనుగ్రహం (05-07-19)

5 Jul, 2019 16:03 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, తిథి శు.తదియ రా.7.04 వరకు, తదుపరి చవితి, నక్షత్రం ఆశ్లేష రా.3.55 వరకు, తదుపరి మఖ, వర్జ్యం సా.5.20 నుంచి 6.50 వరకు, దుర్ముహూర్తం ఉ.8.10 నుంచి 9.00 వరకు, తదుపరి ప.12.30 నుంచి 1.20 వరకు అమృతఘడియలు... రా.2.23 నుంచి 3.54 వరకు

శ్రీ వికారినామ సంవత్సరం తదుపరి ప.12.30 నుంచి 1.20 వరకు
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం అమృతఘడియలు...రా.2.23 నుంచి 3.54 వరకు
తిథి శు.తదియ రా.7.04 వరకు తదుపరి చవితి రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు
నక్షత్రం ఆశ్లేష రా.3.55 వరకు తదుపరి మఖ యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు
వర్జ్యం సా.5.20 నుంచి 6.50 వరకు సూర్యోదయం 5.34
దుర్ముహూర్తం ఉ.8.10 నుంచి 9.00 వరకు సూర్యాస్తమయం. 6.32

భవిష్యం
మిథునం : కుటుంబసభ్యులతో విభేదాలు నెలకొనవచ్చు. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు. వ్యవహారాలలో ఆటంకాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.

వృషభం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.

మేషం : పనుల్లో స్వల్ప ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొంత ఒత్తిడులు. ఆరోగ్యభంగం. బంధుమిత్రులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.

కర్కాటకం : చిన్ననాటి మిత్రులతో చర్చలు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత. విందువినోదాలు.

సింహం : కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు.

కన్య : కుటుంబంలో సందడిగా ఉంటుంది. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధన,వస్తులాభాలు. దైవదర్శనాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.

తుల : ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. అవార్డులు దక్కుతాయి.

వృశ్చికం : దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్య సూచనలు. పనులు మందకొడిగా సాగుతాయి. నిర్ణయాలలో కొన్ని మార్పులు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు : ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు. ముఖ్యమైన పనులు కొన్ని నిదానంగా సాగుతాయి. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి.

మకరం : ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కుంభం : పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు కొంతమేర వసూలవుతాయి. విద్యార్థులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా కొనసాగుతాయి.

మీనం : ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో కొన్ని చిక్కులు.  ఉద్యోగాలలో మరింత పనిభారం. ఆరోగ్యభంగం.

– సింహంభట్ల సుబ్బారావు 

>
మరిన్ని వార్తలు