More

మాతో పాటు వాళ్లు కూడా ప్రతీకారానికి సిద్ధం..

3 Jan, 2020 14:14 IST

టెహ్రాన్‌: ఇరాన్‌ ఖడ్స్‌ ఫోర్స్‌ అధిపతి ఖాసీం సోలేమన్‌ను హతమార్చిన అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ అధినాయకుడు అయాతోల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. సోలేమన్‌ను అంతం చేసినా.. ఆయన చూపిన బాటలో నడవకుండా ఎవరినీ కట్టడి చేయలేరని వ్యాఖ్యానించారు. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా శుక్రవారం రాకెట్‌ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సోలేమన్‌ సహా మరో 8 మంది మృతి చెందారు. ఇరాన్‌ మద్దతున్న హిజ్బుల్‌ బ్రిగేడ్‌ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు.. మంగళవారం ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై చేసిన విషయం విదితమే. ఇందుకు ప్రతీకారంగానే అమెరికా రాకెట్‌ దాడికి పాల్పడినట్లు సమాచారం.

ఈ విషయంపై స్పందించిన ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖామేనీ... స్థానిక మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నో ఏళ్లుగా ఇరాన్‌ మంచి కోసం అవిశ్రాంత కృషి చేసిన సోలేమన్‌కు నేడు అమరత్వం సిద్ధించింది. ఆయన వెళ్లిపోయాడు గానీ ఆయన చూపిన దారిలో సాగడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఆయన రక్తంతో చేతులు తడుపుకొన్న నేరగాళ్లపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుని తీరతాం. మా శత్రువులు ఒక విషయం తెలుసుకోవాలి. మీరిలా చేసినందుకు జీహాద్‌ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతుంది. పవిత్ర యుద్ధంలో మాకోసం విజయం ఎదురుచూస్తోంది’ అని వ్యాఖ్యానించారు.

అదే విధంగా సోలేమన్‌తో పాటు అమరులైన మరికొందరు అధికారుల తరఫున ప్రతీకారం తీర్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ మాట్లాడుతూ... ఇస్లామిక్‌ విలువలను పరిరక్షించేందుకు తమతో పాటు స్వాత్రంత్యం కోరుకునే మరికొన్ని దేశాలు అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. సోలేమన్‌ అమరత్వం తమను ఇందుకు కార్యోన్ముఖుల్ని చేసిందని వ్యాఖ్యానించారు. (చదవండి: ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్‌ దాడి.. 8 మంది మృతి)

చదవండి: ట్రంప్‌ ఆదేశాలతోనే దాడి : వైట్‌ హౌస్‌

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కారణమిదే : చైనా

ఓ వృద్ధ మహిళ కోసం యూకేలో పోరాటం!

ఎన్విరాన్‌మెంటల్ ఫోటోగ్రాఫర్లు.. ఈ ఏడాది విజేతలు వీళ్లే

భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఆ దేశానికి వెళ్లాలంటే నో ‘వీసా’

నిజంగా ఇది వింతే మరి.. పెద్దాయన పెద్ద పేగులో ఈగ..