More

భవిష్యత్‌ డిజిటల్‌ రంగానిదే

10 Feb, 2020 03:15 IST
రాము జూపల్లి, అల్లు అరవింద్, విజయ్‌ దేవరకొండ

– అల్లు అరవింద్‌

‘‘ఏడాది క్రితం ఓ మీడియం మన సినిమాలను తినేస్తుందేమో అనే భయంతో ‘ఆహా ఓటీటీ’ ప్రయాణం మొదలైందని చెప్పవచ్చు. ఆహా గురించి మా అబ్బాయిలకు (అల్లు అర్జున్, అల్లు బాబీ, అల్లు శీరిష్‌)లకు చెప్పగానే..‘నాన్నా.. నువ్వు రేపటిని చూస్తున్నావ్‌’ అన్నారు. తెలుగు వారికి తెలుగు కంటెంట్‌ను చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ‘ఆహా ఓటీటీ’కి శ్రీకారం చుట్టాం’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్‌. ‘ఆహా ఓటీటీ’ ప్రివ్యూ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘ఎవరైనా డిజిటల్‌ మీడియంలోకి రావాలంటే సందేహించొద్దు. భవిష్యత్తు డిజిటల్‌ రంగానిదే. ఇది మాకు కొత్త. అందుకే అందరి సహకారాన్ని కోరుకుంటున్నాం. మై హోమ్‌ రామేశ్వర్‌రావుగారు, రామ్‌లతో పాటు మరికొందరు ‘ఆహా ఓటీటీ’లో భాగస్వామ్యులుగా ఉన్నారు. అజయ్‌ ఠాకూర్‌ హ్యాండిల్‌ చేస్తున్నారు. టెక్నాలజీ బిజినెస్‌ గురించి కోల్‌కతాలోని మా స్నేహితులు, ఓ అమెరికన్‌ కంపెనీ సపోర్ట్‌ తీసుకుంటున్నాం. ఈ ఏడాది పాతిక షోలను ప్లాన్‌ చేస్తున్నాం. దర్శకుడు క్రిష్‌ ఓ షో చేస్తున్నారు. ఇందులో కంటెంట్‌ బోల్డ్‌గా ఉంటుంది. కాబట్టి పేరెంట్‌ కంట్రోలింగ్‌ సిస్టమ్‌ ఉండేలా చూసుకోవాలి’’ అన్నారు. ‘మేం గృహనిర్మాణం నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలోకి అడుగుపెట్టాం.

అరవింద్‌గారి ఆలోచనల నుంచి పుట్టిందే ‘ఆహా ఓటీటీ’. ఇందులో వందశాతం తెలుగు కంటెంట్‌ ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఏడాది ప్రీమియాన్ని 365 రూపాయలుగా నిర్ణయించాం’’ అన్నారు జూపల్లి రామూరావు. ‘‘ఆహా ఓటీటీ’ ఫ్యూచర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ గేమ్‌చేంజర్‌గా చెప్పవచ్చు. టీవీని ఓటీటీ  రీప్లేస్‌ చేస్తుందనిపిస్తోంది. సినిమాల నుంచి వెబ్‌కు యాక్టర్స్‌ క్రాస్‌ ఓవర్‌ అవుతున్నారు’’ అన్నారు విజయ్‌ దేవరకొండ.  ‘‘నా రైటింగ్‌లోని మరో కోణమే ‘మస్తీస్‌’. అజయ్‌భూయాన్‌ బాగా డైరెక్ట్‌ చేశారు. అవకాశం ఇచ్చిన అల్లుఅరవింద్, రామ్, అజిత్‌ఠాగూర్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు దర్శకుడు క్రిష్‌. యాక్టర్‌ నవదీప్‌ మాట్లాడారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

సస్పెన్స్‌ సహస్ర 

నాలాంటి స్టూడెంట్స్‌కి సహాయం చేయాలి! 

Bigg Boss 7: బయటపడ్డ శివాజీ మరో కోణం.. మనోడు బిగ్‌బాస్‌లో బ్రెయిన్‌లెస్ 'చాణక్య'!

'మాధవే మధుసూదన' అలాంటి సినిమా: దర్శకుడు రామచంద్రరావు

నా సినిమా సక్సెస్.. కష్టమంతా మరిచిపోయా: హన్సిక