More

గీతం యూనివర్సిటీలో ఆక్రమణల తొలగింపు

24 Oct, 2020 08:13 IST

సాక్షి, విశాఖ : గీతం యూనివర్సిటీలో ఆక్రమణలను రెవెన్యూ శాఖ అధికారులు తొలగించారు. విశాఖ నగర శివారు రుషికొండ సమీపాన పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమిని ఆధీనంలో ఉంచుకున్న గీతం యూనివర్సిటీ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 40 ఎకరాలు గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూమిని అనుభవిస్తున్నట్లు రెవెన్యూ అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో ఆర్డీవో కిషోర్ పర్యవేక్షణలో రెవిన్యూ సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి ప్రభుత్వ భూమిని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీకి వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. (చదవండి: గీతం ఆక్రమణలకు చెక్‌)

అక్రమాల ‘గీతం’పై ప్రభుత్వం ఆరా..
గీతం విశ్వవిద్యాలయ యాజమాన్యం గుప్పిట్లో 40.51 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయని జిల్లా రెవిన్యూ అధికారులు ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎండాడ, రుషికొండ పరిసరాల్లోని భూముల్ని ఆక్రమించేసుకుని సంస్థ పరిధిలో కలిపేసుకున్నట్లు రెవిన్యూ అధికారులు గుర్తించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి సవివర నివేదికని ప్రభుత్వానికి మరోసారి అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గీతం పరిధిలో కోర్టు కేసుల్లో ఉన్న భూములు ఏఏ గ్రామాల పరిధిలో ఉన్నాయి.? ఆక్రమణలు ఎంత మేర జరిగాయన్నదానిపై నివేదిక అందించనున్నారు. 

దీనికి తోడు.. అడ్డగోలుగా.. అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి.. విద్యా సంస్థల మధ్యలో అండర్‌ పాసేజ్‌ రహదారి నిర్మాణంపైనా అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. రుషికొండ, ఎండాడ గ్రామాల్లో ఉన్న గీతం ఇంజినీరింగ్‌ కాలేజ్‌కి మెడికల్‌ కళాశాలకు అనుసంధానం చేస్తూ సొరంగ మార్గాన్ని నిర్మించేశారు. గత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి.. ఎలాంటి పూర్తి స్థాయి అనుమతులూ తీసుకోకుండా.. జీవో పేరుతో అండర్‌ పాసేజ్‌ నిర్మాణం పూర్తి చేసేశారు. ఈ వ్యవహారంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Nov 19th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

డిసెంబర్‌ 28 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం

తుది దశకు ‘వెలిగొండ’

AP: పింఛన్ల పంపిణీకి జాతీయ అవార్డు