More

లాటరీలో ఏకంగా... రూ.10,588 కోట్లు!

31 Jul, 2022 06:25 IST

అమెరికాలో అతి పెద్ద జాక్‌పాట్‌

వాషింగ్టన్‌: అమెరికాలో ఓ వ్యక్తికి మెగా జాక్‌పాట్‌ తగిలింది. లాటరీలో ఏకంగా 133.7 కోట్ల డాలర్లు గెలుచుకున్నాడు. మన కరెన్సీలో 10,588 కోట్ల రూపాయల పైమాటే! అమెరికాలో గత ఐదేళ్లలో అతి పెద్ద జాక్‌పాట్‌ ఇదేనట. మొత్తంగా చూసుకుంటే ఆ దేశ చరిత్రలో మూడో భారీ జాక్‌పాట్‌.

ఈ సొమ్మును విజేతకు సంవత్సరానికి కొంత మొత్తం చొప్పున 29 ఏళ్ల పాటు చెల్లిస్తారు. ఇలినాయీ రాష్ట్రంలోని కుక్‌ కౌంటీలోని ఓ స్టోర్లో అమ్ముడైన మెగా మిలియన్స్‌ లాటరీకి శుక్రవారం రాత్రి తీసిన డ్రాలో ఈ బంపర్‌ జాక్‌పాట్‌ తగిలింది. దీన్ని సొంతం చేసుకున్న    అదృష్టవంతుడెవరన్నదీ ఇంకా తెలియలేదు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కిరాతకుడికి రష్యా అధ్యక్షుడి క్షమాభిక్ష! సైనికుడిగా ఉక్రెయిన్‌ సరిహద్దుకు..

సింగపూర్‌ ఆహార పోటీల్లో విజేతగా ‘బిరియాని’

ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుపై సైబర్‌ అటాక్‌

‘గ్రేవ్‌యార్ట్‌ ఫర్‌ చిల్డ్రన్‌’ అంటే ఏమిటి? ప్రపంచం ఎందుకు కంటతడి పెడుతోంది?

14 గంటల్లో..ఎనిమిది వందలసార్లు కంపించిన భూమి