More

Messi-Ronaldo: రొనాల్డో ప్రపంచ రికార్డు.. మెస్సీ చూస్తూ ఊరుకుంటాడా?

24 Mar, 2023 11:12 IST

ప్రస్తుత ఫుట్‌బాల్‌ తరంలో లియోనల్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో ఎవరికి వారే సాటి. వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు అందుకున్న ఈ ఇద్దరు సమానంగానే కనిపించినా మెస్సీ ఒక మెట్టు పైన ఉంటాడు. అందుకు కారణం గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను విజేతగా నిలపడమే. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ అత్యధిక గోల్స్‌ చేసి 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనాకు మూడోసారి టైటిల్‌ అందించాడు. ఈ దెబ్బతో రొనాల్డో కాస్త వెనుకబడినట్లుగా అనిపించాడు.

అయితే వ్యక్తిగతంగా చూస్తే మాత్రం ఇద్దరు పోటాపోటీగా ఉంటారు. ఒక రికార్డు రొనాల్డో బద్దలు కొట్టాడంటే వెంటనే మెస్సీ తన పేరిట ఒక రికార్డును లిఖించుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా రొనాల్డో దేశం తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే నీ వెనుకే నేను వస్తా అంటూ మెస్సీ కూడా తన కెరీర్‌లో 800వ గోల్‌ సాధించి కొత్త రికార్డు అందుకున్నాడు.

బ్రూనస్‌ ఎయిర్స్‌ వేదికగా గురువారం అర్జెంటీనా, పనామాల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ సేన 2-0 తేడాతో విజయం సాధించింది. ఆట 89వ నిమిషంలో అ‍ర్జెంటీనాకు లభించిన ఫ్రీకిక్‌ను మెస్సీ తనదైన శైలిలో గోల్‌గా మలిచాడు. దీంతో తన కెరీర్‌లో 800వ గోల్‌ పూర్తి చేసుకున్న మెస్సీ అర్జెంటీనా తరపున 99వ గోల్‌ సాధించాడు. వంద గోల్స్‌ మార్క్‌ను చేరుకోవడానికి మెస్సీ ఇక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇక క్లబ్స్‌ తరపున 701 గోల్స్‌ చేసిన మెస్సీ ఓవరాల్‌గా 800 గోల్స్‌తో కొనసాగుతున్నాడు.  గతేడాది డిసెంబర్‌లో ఖతర్‌ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిచిన జట్టుతోనే అర్జెంటీనా బరిలోకి దిగడం విశేషం.

చదవండి: ఫుట్‌బాల్‌లో సంచలనం.. చారిత్రాత్మక గోల్

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కేఎల్‌ రాహుల్‌ సుడిగాలి శతకం.. వరల్డ్‌కప్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌

IND VS NED: విరాట్‌ కంటే ఎక్కువగా బాధపడిపోయిన అనుష్క

తొమ్మిదేళ్ల తర్వాత వికెట్‌ తీసిన విరాట్‌.. ఏకంగా కెప్టెన్‌కే ఝలక్‌

భారత బ్యాటర్ల మహోగ్రరూపం.. విలవిలలాడిన నెదర్లాండ్స్‌ బౌలర్‌, చెత్త రికార్డు

టపాసుల్లా పేలిన టీమిండియా బ్యాటర్లు.. వరల్డ్‌కప్‌ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్‌