ఆంధ్ర ప్రదేశ్ » గుంటూరు

జిల్లా ముఖచిత్రం గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతంలో ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం గుంటూరు. రాష్ట్ర రాజధాని అమరావతి. విద్యా కేంద్రంగా అనాదిగా పేరు పొందింది. పొగాకుమిరప జిల్లా ప్రధాన వ్యవసాయ ఎగుమతులు. 2022లో ఈ జిల్లాలోని భూభాగాలను కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లాపల్నాడు జిల్లాలలో కలిపారు.

తూర్పున ఎన్టీఆర్ జిల్లాకృష్ణా జిల్లా, దక్షిణాన బాపట్ల జిల్లా, పశ్చిమాన బాపట్ల జిల్లాపల్నాడు జిల్లా, ఉత్తరాన పల్నాడు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. చాలవరకు సమతల ప్రదేశం. కొన్ని కొండలు కూడా ఉన్నాయి. కృష్ణా డెల్టా కొంతభాగం దీనిలో ఉంది.

గుంటూరు ప్రాంతంలో పాతరాతి యుగం నాటినుండి మానవుడు నివసించాడనుటకు ఆధారాలు ఉన్నాయి. రాతియుగపు పనిముట్లు గుంటూరు జిల్లాలో దొరికాయి. వేంగీ చాళుక్య రాజు అమ్మరాజ (922-929) శాసనాలలో గుంటూరును గురించిన ప్రథమ ప్రస్తావన ఉంది. 1147, 1158 రెండు శాసనాలలో గుంటూరు ప్రసక్తి ఉంది.

భారత  స్వతంత్ర సంగ్రామం లోను, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటు లోను జిల్లా ప్రముఖ పాత్ర వహించింది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంలో భాగమైంది. మద్రాసు రాష్ట్రం లోని తెలుగు మాట్లాడే జిల్లాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని వాదించాయి. ఫలితంగా 1953లో 11 జిల్లాలతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. 1970 ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసినపుడు జిల్లా రూపురేఖలలో మళ్ళీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఒంగోలు తాలూకా మొత్తం, బాపట్ల, నరసరావుపేట, వినుకొండ తాలూకాలలోని కొన్ని ప్రాంతాలను విడదీసి ప్రకాశం జిల్లాలో కలిపి ఏర్పాటు చేసారు. దీనితో జిల్లా వైశాల్యం 15032 చ. కి. మీ నుండి 11,347 చ. కి. మీకి తగ్గిపోయింది.

జిల్లా వివరాలు
జిల్లా గుంటూరు
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
అసెంబ్లీ నియోజకవర్గాలు 17
మొత్తం ఓటర్ల సంఖ్య 4,099,054
పురుషులు 1,996,320
మహిళలు 2,102,312
Advertisement
Advertisement