ఆంధ్ర ప్రదేశ్ » వైఎస్ఆర్ కడప

Advertisement
వైఎస్ఆర్ కడప వార్తలు
Advertisement
జిల్లా ముఖచిత్రం

వైఎస్‌ఆర్ జిల్లా కేంద్రం కడప. దేవుడి గడప కాబట్టి కడపకు ఆ పేరు వచ్చిందంటారు. 2022లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ జిల్లాను విభజించి కొంత భాగంతో అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేశారు.

పల్లవులు, తెలుగు చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు, గండికోట పెమ్మసాని నాయకులు, నిజాం నవాబులు, సిద్ధవటం నుంచి పరిపాలించిన మట్లి రాజులు, కడప నవాబులచే ఈ ప్రాంతం పరిపాలించబడింది. చరిత్రలో చాలా మంది ప్రముఖ కవులు, కవయిత్రులు, తత్వవేత్తలు ఈ జిల్లాకు చెందినవారే.

పూర్వం ఈ జిల్లాకు హిరణ్యదేశం అని పేరు ఉంది. క్రీ.పూ. 274-236 ప్రాంతంలో అశోక చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఆ తరువాత శాతవాహనులు పాలించారు. శాతవాహనుల నాణేలు పెద్దముడియం, దానవులపాడు గ్రామాల్లో దొరికాయి. సా.శ. 250-450 ప్రాంతంలో పల్లవరాజులు పాలించారు. ఇంకా రాష్ట్రకూటులు, చోళులు, కళ్యాణి చాళుక్యులు, వైదుంబులు, కాకతీయులు మొదలైన రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి.

1336-1565 కాలంలో విలసిల్లిన విజయనగర సామ్రాజ్యంలో వైఎస్ఆర్ (కడప) జిల్లా ఒక భాగం. గండికోటను పాలించిన పెమ్మసాని నాయకులు విజయనగర రాజులకు సామంతులుగా విధేయులై పేరుప్రఖ్యాతులు పొందారు. నంద్యాల రాజులు, మట్లి రాజులు కూడా ఈ ప్రాంతం మీద పెత్తనం సాగించారు.

విజయనగర పతనం తర్వాత గోల్కొండ నవాబులు, బీజాపూరు సుల్తానులు, ఔరంగజేబు మొదలైన మహమ్మదీయ రాజులు పాలించారు. సా.శ. 1710 ప్రాంతంలో అబ్దుల్ నబీ ఖాన్ కడపలో కోటను నిర్మించాడు. నవాబుల తర్వాత పాలెగాళ్ళు విజృంభించారు. ఆ తరువాత ఈస్టిండియా కంపెనీ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వహించింది. సర్ థామస్ మన్రో వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టరుగా పనిచేశాడు. రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ ప్రాంతపు అభివృద్ధికి బ్రిటీషు ప్రభుత్వంలో కొంతవరకు కృషి జరిగింది.

సి.పి.బ్రౌన్ తెలుగు భాషను సముద్ధరించాడు. మనుచరిత్ర, వసుచరిత్ర వంటి తెలుగు కావ్యాలను ముద్రించాడు. మూడు వేలకు పైగా వేమన పద్యాలను సేకరించాడు. వాటిని ఇంగ్లీషులోకి అనువదించి అచ్చు వేయించాడు. ఇక కోలిన్ మెకంజీ గ్రామాల చరిత్రను సేకరించి కైఫీయతుల పేరుతో భద్రపరిచాడు.

2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిది ఈ జిల్లా పులివెందులలోని ఇడుపులపాయ. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు గుర్తుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2010 జూలై 7న జిల్లా పేరును వైఎస్సార్‌ జిల్లాగా మార్చింది.  2022 ఏప్రిల్ 4న జిల్లాను విభజించి అన్నమయ్య జిల్లా ఏర్పాటుచేశారు.

జిల్లా వివరాలు
జిల్లా వైఎస్ఆర్ కడప
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
అసెంబ్లీ నియోజకవర్గాలు 10
మొత్తం ఓటర్ల సంఖ్య 2,308,366
పురుషులు 1,132,722
మహిళలు 1,175,367
Advertisement
Advertisement