సోషల్‌ చెత్తకు చెక్‌

14 Oct, 2019 20:04 IST
సామాజిక మాధ్యమాల్లో అవాంఛనీయ సమాచారానికి చెక్‌ పెట్టేందుకు నగరంలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ బృందం వినూత్న టూల్‌ను రూపొందించింది. ‘నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌’ పేరిట రూపొందించిన ఈ టూల్‌ అనవసర సమాచారాన్ని కట్టడి చేయడంతో పాటు అలాంటి సమాచారం వచ్చినప్పుడు అలర్ట్‌ను సైతం ఇస్తుంది.  కౌమార దశలో ఉన్నవారు అవాంఛిత ఫొటోలు, సమాచారాన్ని చూసినప్పుడు వారిలో  భావోద్వేగాలు విపరీత ప్రవర్తనకు దారితీస్తుంటాయి. ఈ అవాంఛనీయ సమాచారాన్ని కట్టడి చేసేందుకు ఈ టూల్‌ను రూపొందించింది.