గ్రహం అనుగ్రహం

17 Sep, 2017 01:33 IST|Sakshi
గ్రహం అనుగ్రహం

గ్రహం అనుగ్రహం శ్రీ విళంబి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి బ.విదియ సా.5.26 వరకు, తదుపరి తదియ, నక్షత్రం పుబ్బ ఉ.7.55 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం ప.2.40 నుంచి 4.10 వరకు, దుర్ముహూర్తం ఉ.10.19 నుంచి 11.06 వరకు, తదుపరి ప.2.54 నుంచి 3.40 వరకు, అమృతఘడియలు... రా.11.40 నుంచి 12.34 వరకు.

సూర్యోదయం :    6.29
సూర్యాస్తమయం    :  5.59
రాహుకాలం :  ప. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

నమాజ్‌ వేళలు
ఫజర్‌ : 5.29
జొహర్‌ : 12.30
అసర్‌ : 4.42
మగ్రీ  : 6.16
ఇషా     : 7.32

భవిష్యం

మేషం: ఆకస్మిక ధనలాభం. ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

వృషభం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు నెమ్మదిగా సాగుతాయి. పాతమిత్రుల కలయిక. అనారోగ్యం. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

మిథునం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆర్థిక సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. కొన్ని పనులు సజావుగా సాగుతాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. భూలాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

సింహం: పనుల్లో ఆటంకాలు. రుణాలు చేస్తారు. బంధువర్గంతో తగాదాలు. శ్రమ తప్పదు. ఆరోగ్యభంగం. ఉద్యోగ యత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు ఎదురుకావచ్చు.

కన్య: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. పనులు సజావుగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. నూతన ఒప్పందాలు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.

తుల: బంధుమిత్రులతో కలహాలు. కుటుంబంలో ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులు ముందుకు సాగవు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. నూతన విద్యావకాశాలు. భూవివాదాల పరిష్కారం. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

ధనుస్సు: ముఖ్య వ్యవహారాలలో విజయం. బంధువుల నుంచి సహాయం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

మకరం: వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ముఖ్య వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు తప్పవు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

కుంభం: వ్యతిరేకులు పెరుగుతారు. ఆప్తులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు సంభవం. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో వివాదాలు. ఉద్యోగాలలో మాటపడాల్సిన పరిస్థితి.

మీనం: అనుకోని పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆహ్వానాలు రాగలవు. నూతన ఉద్యోగాలు పొందుతారు. వ్యాపారాలలో అనుకూలం. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.
– సింహంభట్ల సుబ్బారావు 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టారో

వారఫలాలు

వారఫలాలు : 4 మార్చి నుంచి 10 మార్చి 2018 వరకు

టారో : 4 మార్చి నుంచి 10 మార్చి, 2018 వరకు

టారో : 14 జనవరి నుంచి 20 జనవరి, 2018 వరకు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రొమాంటిక్‌   ఎన్‌ఆర్‌ఐ

మా ఆనందానికి కారణం అభిమానులే

అంతా మాయ.. సినిమాలు వద్దన్నారు – శ్రీధర్‌రెడ్డి

గ్యాంగ్‌స్టర్‌ లవ్‌

భారతీయుడు ఆగడు

‘ఎన్‌ఆర్‌ఐ’ని క్లాప్‌ కొట్టి ప్రారంభించిన అమల