మాజీ మంత్రి ఉమా ప్లాన్‌ రివర్స్‌

17 Jun, 2021 04:36 IST|Sakshi

మహిళలతో ప్రభుత్వాన్ని తిట్టించాలనుకొని.. తానే తిట్లు తిన్న వైనం

మైలవరం: మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావుకు మైలవరంలో ఘోర పరాభవం ఎదురైంది. చాలా కాలం తర్వాత పార్టీ నాయకులతో కలసి బుధవారం ఉమా ఇక్కడికి వచ్చారు. స్థానిక దళితవాడ నుంచి నలుగురు మహిళలను వెంటబెట్టుకుని అయ్యప్పనగర్‌లో పేదల కోసం ఏర్పాటు చేసిన ప్లాట్లలోకి వెళ్లారు. నిరుపేదల కోసం ఏర్పాటు చేసిన ఆ ప్లాట్లను వారికి ఇవ్వలేకపోతున్నారని ఆరోపిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ను, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌ను ఆ మహిళలతో తిట్టించే ప్రయత్నం చేశారు.

అయితే ఈ పథకం బెడిసి కొట్టింది. గతంలో ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, ఇప్పుడు సరిహద్దు రాళ్లు కూడా పీకేశారని గ్రామానికి చెందిన పచ్చిగోళ్ల మరియమ్మ మాట్లాడుతూ.. ఆ రాళ్లు పీకేయించిన ఉమాని బట్టలూడదీసి కొట్టాలని అనడంతో టీడీపీ నేతలు ఖంగుతిన్నారు. వెంటనే ఉమాతో సహా పార్టీ నాయకులు అక్కడి నుంచి జారుకున్నారు.  

మరిన్ని వార్తలు