అశ్లీల సినిమాలతో యువత పెడదోవ

9 May, 2019 06:55 IST|Sakshi

ముషీరాబాద్‌: ప్రస్తుతం విడుదలవుతున్న కొన్ని సినిమాలలో ఆశ్లీల దృశ్యాలు చాలా అభ్యంతరకరంగా ఉంటున్నాయిని, అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్‌ 100 లాంటి సినిమాలతో మరింత అశ్లీలత పెరిగిందని, నేడు ‘డిగ్రీ కాలేజీ’ పేరుతో  వస్తున్న సినిమాలో మరింత విశృంఖలత్వంతో కూడిన దృశ్యాలున్నాయని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్‌) నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సినిమా ఇటీవల ట్రైలర్‌ మూడు నిమిషాలే  ఉందని, దానిని చూస్తేనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తోందన్నారు. 

బుధవారం పీవైఎల్‌ నాయకులు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్, రీజినల్‌ ఆఫీసర్‌ రాజశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ప్రదీప్‌ మాట్లాడుతూ... సినిమాలలో వస్తున్న శృంగార విశృంఖలత్వం చూసి యువత చెడిపోయే ప్రమాదముందన్నారు. ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని సెన్సార్‌ బోర్డును డిమాండ్‌ చేశారు.  పీవైఎల్‌ నాయకులు  కె.రాజేందర్, డివిఎస్‌.కృష్ణ, ఎం.ఆంజనేయులు, రాకేశ్‌రెడ్డి, అశోక్, సమీర్, సాయి, సందీప్‌ పాల్గన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు