ఎక్కడిదీ ‘చెత్త': నాకే వైరస్ వచ్చినట్టు...

28 Mar, 2020 10:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి కోవిడ్ -19 (కరోనా వైరస్) ను అడ్డుకునేందుకు 21 రోజుల లాక్ డౌన్ నేపథ్యంలో ఢిల్లీ మున్సిపల్ కార్మికుడి జీవనం, అతడు భయంకరమైన అనుభవాలు, ఎదుర్కొంటున్న వివక్ష మనుసును ద్రవింప చేస్తోంది. హృదయాలను కదిలిస్తూ.. అసలు ‘చెత్త'  ఎక్కడుంది. దీన్ని వదిలించుకోవాల్సింది ఎవరు? ఎక్కడ..అనే  ప్రశ్నల్ని లేవనెత్తుతుంది.

ఢిలీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎంసీ) లో కాంట్రాక్ట్  కార్మికుడు మనోజ్ పాల్  (37). ప్రతిరోజు ఉదయం తనకు నిర్దేశించిన ప్రాంతాలకు  వెళ్లి చెత్తను సమీకరించడం, దానికి సెగ్రిగేట్  చేసి దూరంగా పారవేయడం ఇదీ మనోజ్  డ్యూటీ.  ఇతనికి భార్య ముగ్గురు పిల్లలు  ఉన్నారు. తన ఇంట్లోని సెకండ్ హ్యాండ్ టెలివిజన్ ద్వారా లాక్ డౌన్ వార్త అతని చెవిని పడింది. మహమ్మారి ప్రజలను బలవంతంగా ఇంట్లో వుండేలా చేస్తే..అతని జీవనంలో  మాత్రం ఎలాంటి మార్పులేదు.. ఎప్పటిలాగానే మరుసటి రోజు తెల్లవారుజామున లేచి   పాల్ పట్పర్గంజ్ పారిశ్రామిక ప్రాంతంలోని తన కాంట్రాక్టర్ కార్యాలయానికి వెళ్లి రిజిస్టర్‌లో సంతకం చేసి, కిలోమీటరు దూరంలో ఉన్న ఈడీఎంసీ కార్యాలయానికి వెళ్లి ..ఆపై తనకు కేటాయించిన టిప్పర్ ట్రక్కు ఎక్కడంతో డ్యూటీ మొదలవుతుంది.   ఉదయం 9 గంటల్లా పట్పర్‌గంజ్‌లోని మొదటి కాలనీకి రిపోర్ట్ చేయాలి. అనేక గేటెడ్ పరిసరాల్లో తమ చెత్తను పారవేసేందుకు  వారే గేటు వద్దకు వస్తారు, లేదా కాలనీకి చెందిన ఒక కార్మికుడు ప్రతి ఇంటి నుండి సేకరించి పాల్ వ్యాన్‌లో పడవేస్తాడు. అయితే ఇక్కడే తనకు అనేక భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయి అంటారు మనోజ్. 

మనోజ్  మాటల్లో : గత  నాలుగు రోజులుగా అందరూ నన్ను వైరస్ సోకిన వాడిలా, ఏదో అనారోగ్యంతో ఉన్నట్లు చూస్తున్నారు. భయం భయంగా చూస్తూ.. చెత్తను అందిస్తున్నారు. నిజానికి  సాధారణ రోజులలో కూడా ఇలాంటి వివక్షనే ఎదుర్కొంటాం.. ప్రస్తుత తరుణంలో ప్రజల ధోరణి, నన్ను చూసే విధానం ఇంకా ఘోరంగా తయారైంది..గత ఒక వారంగా,ఎక్కువ మంది  మాస్క్ లతో, లేదా వస్త్రంతో జాగ్రత్తగా కప్పుకుని వస్తారు.. నా చేతిని తాకకకుండా  ఉండేందుకు చాలా జాగ్రత్త పడతారు.  కొందరైతే చేతులు కడుక్కోవడానికి ఇంటికి  వెళ్లేదాకా  కూడా ఆగరు. వెంటనే నా ముందే సానిటైజర్లు వేసుకుని రద్దుకుంటారంటే ఆవేదన వ్యక్తం చేశారు. రోజు పెరుగుతున్న కొద్దీ పని తీవ్రత  కూడా పెరుగుతుంది. చెత్తలో ప్రజలు వాడి పారేసిన మాస్క్ లుకూడా వుంటాయి తెలుసా.. భోజనానికి అరగంట విరామం తీసుకుంటాను. భార్య కట్టిచ్చింది తినడానికి 15 నిమిషాలు.ఆ తరువాత  ఇంటికి ఫోన్ చేసి  వాళ్ల గురించి అడుగుతా అంటూ చెప్పారు రెండు రోజుల క్రితం వరకూ  గ్లౌజులు, మాస్క్ లు ఎంటా వుంటాయో  కూడా తెలియని  మనోజ్  తన చిరిగిన గ్లౌజ్ ను అప్యాయంతా తడుముతూ.

మనోజ్ చెప్పిన ఇంకో భయంకరమై  విషయం గురించి కూడా తప్పకుండా మాట్లాడుకోవాలి.  కరోనా  వైరస్ పాజిటివ్ గా నిర్దారణ అయ్యి హోం క్వారంటైన్ లో  ఉన్న ఇళ్లలోని చెత్త పరిస్థితి ఏంటి. ఆ చెత్తను ఎవరు తీస్తారు. దీనికి కూడా మనోజ్ వద్ద సమాధానం వుంది. అధికారుల ఆదేశాల మేరకు గృహ నిర్బంధంలో ఉన్న నాలుగు ఇళ్లు నాకు కేటాయించిన జోన్‌లో ఉన్నాయి.  ఈ ఇళ్ళ నుండి వ్యర్థాలను నేనే  సేకరించడాలి. ఇందుకు ఒక ప్రత్యేక ట్రక్ ఉంది అంటారు నిర్వేదంగా చూస్తూ... 

శానిటైజర్లు,  హ్యాండ్ వాష్ లు గట్రా లేవుగా..  మరి వారి వ్యక్తిగత రక్షణ ఎలా?
పనిని ముగించిన తరువాత సాయంత్రం 5.30కు తన సహచరులతో ఒక కప్పు టీ తాగి సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరతా.. పిల్లలు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు.. పిల్లలకు వైరస్ అంటుకుంటుందని భయం.  జాగ్రత్తగా వుండాలిగా.. అందుకే బూడిదతో బాగా  చేతులు రుద్దుకొని, నీళ్లతో  కడుక్కుంటాను...దుమ్మంతా శుభ్రంగా దులుపుకుంటాను.   అయినా వైరస్ తో చావాలని  ఆ విధి రాసి పెడితే.. ఏ దేవుడూ రక్షించలేడు అంటారు వేదాంతిలా.. అన్నట్టు  మరో  విషయం   ప్రతి రోజు రాత్రి 9 గంటలకు అందరూ తప్పకుండా కలిసి  భోంచేయాలని మనోజ్ కుటుంబం  ఒట్టు పెట్టుకుందిట. టీవీలో వస్తున్న వార్తల్ని చూస్తూ...విదేశాలనుంచి విమానాల ద్వారా  వచ్చిన ధనవంతులనుంచి ఈ వైరస్ వచ్చిందని నాకు తెలుసు...కానీ నిజానికి ఫలితం మాత్రం నాలాంటి వాళ్లదే అంటారు మనోజ్ చెమ్మగిల్లిన కళ్లతో.
 (హిందుస్తాన్ టైమ్స్ కథనం ఆధారంగా)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు