స్వచ్ఛతకు ‘దివ్యో’పాయం

7 Jan, 2018 12:12 IST|Sakshi

వంద శాతం స్వచ్ఛ ఆదిలాబాద్‌ కోసం వినూత్న ఆలోచన

మండలాల్లో ఒక్కో అధికారికి ‘రెండు గ్రామాల’ టాస్క్‌

lఎంపీడీవో, ఈవోపీఆర్డీ, ఏపీఓలు, ఏపీఎంలు, వివిధ శాఖల ఇంజినీరింగ్‌ సిబ్బందికి బాధ్యతలు

lలక్కీడ్రా ద్వారా గ్రామాల అప్పగింత

lరెండో దశలో మిగిలిన 165 జీపీల్లో స్పెషల్‌డ్రైవ్‌

లక్ష్యంలో ఫిబ్రవరిలో 50శాతం, మార్చిలో 50 శాతం పూర్తి చేసేలా ప్రణాళిక

సాక్షి, ఆదిలాబాద్‌: వంద శాతం స్వచ్ఛ ఆదిలాబాద్‌ సాధించేందుకు జిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ వినూత్న ఆలోచన చేశారు. మండలాల్లో అధికారులకు రెండు గ్రామాల చొప్పున కేటాయించి లక్ష్యం పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. మండల అధికారు లు, వివిధ శాఖల్లోని ఇంజినీరింగ్‌ సిబ్బందికి ఈ లక్ష్యాన్ని కేటాయించి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని నిర్ణయించారు. లక్కీ డ్రా ద్వారా గ్రామాలను అప్పగించారు. లక్ష్యం లో ఫిబ్రవరిలో 50 శాతం, మార్చిలో 50 శాతం లో పూర్తి చేసేలా ఆలోచన చేసి ముందుకు కదులుతున్నారు. ఆమె అనుకు న్న విధంగా మార్చి లో పూర్తి స్థాయిలో కాకపోయినా ప్రభుత్వ లక్ష్యం మేరకు గడువు కంటే ముందే స్వచ్ఛ ఆదిలాబాద్‌ సాకారమయ్యే అవకాశాలు ఉన్నాయి.  

రెండో దశలో 165 జీపీల్లో స్పెషల్‌డ్రైవ్‌..
రాష్ట్ర స్వచ్ఛభారత్‌ మిషన్‌ (గ్రామీణ)ఆధ్వర్యం లో అన్ని జిల్లాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. గతంలో గ్రామీణ నీటి సరఫరా, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథ కం ఆధ్వర్యంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మా ణాలు చేపట్టారు. ఆ తర్వాత గతేడాది జూన్‌ నుంచి ఆర్‌డబ్ల్యూఎస్, ఉపాధిహామీల నుంచి ఐహెచ్‌హెచ్‌ఎల్‌ను నిలిపివేసి పూర్తిగా డీఆర్‌డీఓలోని ఎస్‌బీఎంకు బదలాయించారు. జిల్లాలో మొదటి దశలో 78 గ్రామపంచాయతీల్లో వ్యక్తిగ త మరుగుదొడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

ఈ గ్రామపంచాయతీల్లో 20వేలకు పై గా లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు 11వేలకు పై గా పూర్తిచేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 9వేలు పూర్తి చేయాల్సి ఉంది. ఇక మిగిలి న 165 గ్రామపంచాయతీలను రెండో దశ కింద తీసుకొని ఈ స్పెషల్‌డ్రైవ్‌ను కలెక్టర్‌ అమలు చే స్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, నీటిపారుదల శాఖ, గిరిజన సం క్షేమ శాఖ, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లోని ఇంజినీరింగ్‌ శాఖ సిబ్బంది సహకారంతో ఎంపీడీవోలు, ఈఓపీఆర్డీలు, ఏపీఎంలు, ఏపీవోలు ఈ కార్యం లో పాల్గొంటున్నారు. చెరో రెండు గ్రామాలను టాస్క్‌గా కేటాయించారు. ఈ గ్రామాలను లక్కీ డీప్‌ ద్వారా వారికి కేటాయించారు. రెండు గ్రామాల్లో ఒకటి ఫిబ్రవరి, మరొకటి మార్చిలో తీసుకొని ఆ గ్రామాలను ఓడీఎఫ్‌గా మార్చేందుకు కృషి చేయాలి. తద్వారా 165 గ్రామపంచాయతీలను 80 మందికి పైగా అధికారులకు బాధ్యతలు అప్పగించి ఈ కార్యాన్ని సఫలీకృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.  

ఇంటింటికి మరుగుదొడ్డి..
గ్రామీణ ప్రాంతాల్లో నీటి కలుషితం కారణంగా అనేక రోగాలు ప్రబలి పర్యావసనంగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రధానంగా పారిశుధ్య లోపం కారణంగానే ఈ పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన నీటిని కలుషితం చేస్తోంది. గ్రామాల్లో ఇప్పటికీ ఇది ప్రధాన సమస్యగా ఉందంటే నమ్మాల్సిందే. పారిశుధ్యం మెరుగుపర్చాలంటే ప్రధానంగా వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరుగుదొడ్డి నిర్మించుకొని వినియోగించడం ముఖ్యమని ప్రజల్లో భావన తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

 అయితే సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత ప్రవర్తన కారణాలతో పలువురు మరుగుదొడ్డి నిర్మాణాలకు ముందుకు రాకపోవడం సవాలుగా మారుతుంది. ఈ నేపథ్యంలో గౌరవం, గోప్యత, సురక్షిత, సాంఘికస్థితి తెలియజేసేందుకు ఇంటింటికి మరుగుదొడ్డి ఉండాలనే నినాదంతో ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2014 అక్టోబర్‌ 2న కేంద్ర ప్రభుత్వం క్లీన్‌ ఇండియా నినాదంతో 2019 అక్టోబర్‌ 2కు స్వచ్ఛభారత్‌ నిర్మించాలనే ఉద్దేశ్యంతో వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణంపై దృష్టి సారించింది. దీని ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ మిషన్‌ (గ్రామీణ)అనే కార్యక్రమాన్ని చేపట్టి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టింది.

 2018 అక్టోబర్‌ 2 నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయా లని లక్ష్యం పెట్టుకుంది. గత ప్రభుత్వాల హయాంలో మరుగుదొడ్ల నిర్మాణం జరిగినప్పటికీ ఉమ్మడి జిల్లాలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా పెద్దఎత్తున మరుగు దొడ్డి సామగ్రి కొనుగోలు చేసినప్పటికీ నిర్మా ణాలు జరగకపోవడం, సామగ్రి కూడా వృథా అయినటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. బేస్‌లైన్‌ సర్వే 2012 ప్రకారం స్వచ్ఛభారత్‌లో భాగంగా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు లేని ఇళ్ల సముదాయాలను గుర్తించడం జరిగింది.

జనవరి 31లోగా పరిపాలన ఆమోదం తీసుకోవాలి..
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగిరం చేసేందుకు కలెక్టర్‌ వినూత్న ఆలోచన చేశారు. లక్కీడీప్‌ ద్వారా అధికారులకు గ్రామాలను కేటాయించడం జరిగింది. మిగిలిన 165 గ్రామపంచాయతీల్లో జనవరి 31లోగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి పరిపాలన ఆమోదం తీసుకోవాలి. మార్చిలో అనుకున్న మేరకు టాస్క్‌ పూర్తి చేస్తాం. ఒకవేళ కొంత మిగిలిపోయినా గడువుకంటే ముందే పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు అక్టోబర్‌ 2కు ముందే జిల్లాను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దుతాం.
– రాజేశ్వర్‌ రాథోడ్,
డీఆర్‌డీవో, ఆదిలాబాద్‌ జిల్లా

మరిన్ని వార్తలు