సిలిండర్‌ పేలి ఇల్లు దగ్ధం

27 Jan, 2018 16:38 IST|Sakshi
బాధితురాలికి బట్టలు అందజేస్తున్న నాయకులు

బెజ్జూర్‌(సిర్పూర్‌) : మండలంలోని మర్తడిలో గురువారం రాత్రి స్రవంతికి చెందిన ఇల్లు ప్రమాదవశాత్తు సిలిండర్‌ పేలి దగ్దమైంది. ప్రమాదంలో ఇంట్లోని ఆహార ధాన్యాలు, బట్టలు అన్ని పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న బెజ్జూర్‌ ఎస్సై శివప్రసాద్, తహసీల్దార్‌ రఘునాధ్‌లు సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించారు. సర్పంచ్‌ ఉమ్మెర పోచక్కలింగయ్య, ఎంపీటీసీ బూస సుశీలసారయ్య, కోఆప్షన్‌ సభ్యులు బసరాత్‌ ఖాన్, వార్డు మెంబర్‌ శంకర్‌ బాధితురాలిని పరామర్శించారు. బాధిత మహిíßళకు మండల కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి నహీర్‌ అలీ, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్దన్, మండల శాఖ అధ్యక్షుడు దేవనపల్లి సత్యనారాయణ, నాయకులు పూల్లూరి సతీష్, జిల్లాల సుధాకర్‌గౌడ్, శంకర్, పెంటయ్య, బాపు, తిరుపతి, ఎంపీటీసీ తాళ్ళ ఇందిరా రామయ్య, నియోజక వర్గ నాయకులు రావి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో 25కిలోల బియ్యం, బట్టలతో పాటు వెయ్యి రూపాయల నగదు అందజేశారు.
 

మరిన్ని వార్తలు