సీపీఎస్‌ రద్దు చేయాలని ధర్నా 

23 Feb, 2018 16:04 IST|Sakshi
బోథ్‌: ధర్నాలో పాల్గొన్న నాయకులు

ఇచ్చోడ : కేంద్ర ప్రభుత్వం వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి వోపీసీ పునరుద్ధరించాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లరత్నాకర్‌ రెడ్డి అన్నారు. సీపీఎస్‌ రద్దు కోరుతు మండల కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏకీకృత సర్వీసు రూల్స్‌ రూపొందించి డీఈవో, డిప్యూటీ ఈవో, ఎంఈవో, జీహెచ్‌ఎం, ఎస్‌ఎలను అఫ్‌గ్రెడ్‌ చేసిన పండితులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు డైట్, జేఎల్‌ పోస్టులకు బదిలీలు చేపట్టి పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోషియేట్‌ అధ్యక్షులు ప్రకాశ్‌గౌడ్, జిల్లా బాధ్యులు జయరాం, అశోక్, దేవర్ల సంతోష్, రాజేశ్వర్,  మండల అధ్యక్షులు కె ప్రవీణ్‌కుమార్, కార్యదర్శి భగత్‌ కాశినాథ్,  బుచ్చిబాబు, అన్వర్‌అలీ, రాష్ట్ర కార్యదర్శి మల్లెష్,  సీపీఎస్‌ ఉపాధ్యాయులు రాజన్న, సిరికొండ మండల అధ్యక్షులు కాంతయ్య, కార్యదర్శి జైతు పాల్గొన్నారు.

వెంటనే రద్దు చేయాలి...
బోథ్‌: మండల తహసీల్‌ కార్యాలయం ఎదుట పీఆర్టీయూ నాయకులు సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి  మాట్లాడుతూ సీపీఎస్‌ విధానంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. వారి కుటుంబాలు రోడ్డునే పడే విధంగా ఈ విధానం ఉందని పేర్కొన్నారు.  అనంతరం తహసీల్దార్‌ దుర్వ లక్ష్మణ్‌కు వినతిపత్రం అందించారు.  మండల అధ్యక్షులు భిక్కులాల్, ప్రధాన కార్యదర్శి జావిద్‌ అలీ, మండల  పరిశీలకులు ఆర్‌టివి ప్రసాద్, రాజ్‌ నారాయణ, జిల్లా నాయకులు జయరాజ్, గంగయ్య,పోశెట్టి, సతీష్, అనిల్‌ పాల్గొన్నారు. 
 
గుడిహత్నూర్‌లో...
గుడిహత్నూర్‌ : మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పీఆర్టీయూ మండలాధ్యక్షుడు సుభాష్‌ మోస్లే, ప్రధాన కార్యదర్శి మైస మాధవ్, అసోసియేట్‌ ప్రసిడెంట్‌ నాందేవ్, మహిళాధ్యక్షురాలు భూలత, కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర అసోసియేట్‌ ప్రసిడెంట్‌ జాదవ్‌ సుదర్శన్, ఎంఈవో నారాయణ, సీనియర్‌ నాయకులు రాజేషుడు, వెంకటరమణ, నాగ్‌నాథ్, రమేష్‌ రెడ్డి, భీంరావ్, మోహన్, జరీనాబేగం, అర్చన, సీపీఎస్‌ ఉద్యోగులు శ్రీనివాస్‌ ఉన్నారు.

పాత పింఛన్‌ విధానం తేవాలి...
బజార్‌హత్నూర్‌ : పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నాకర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో తహసీల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ రాజు, జిల్లా అసోషియేట్‌ సభ్యులు జయరాం, ప్రకాష్‌గౌడ్, రాష్ట్ర పరిశీలకుడు సంతోష్, మండల అధ్యక్షులు చంద్రకాంత్‌బాబు, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, సభ్యులు లక్కం విజయ్‌శేఖర్, ఆర్‌.ప్రకాష్, సధానంధం, ఆర్‌ శంకర్, వెంకట రమణ, చందన్‌బాబు,మోహన్, శంకర్, జంగుబాబు పాల్గొన్నారు.

రద్దు చేసే వరకు పోరాటం ...
నేరడిగొండ : సీపీఎస్‌ విధానం రద్దయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని పీఆర్టీయూ టీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి సహదేవ్‌ అన్నారు. తహసీల్దార్‌ కూనాల గంగాధర్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.  ఆ సంఘం మండల అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నారాయణగౌడ్, జిల్లా కార్యదర్శి గంగాధర్, ఉపాధ్యక్షుడు గంగాధర్, ఉపాధ్యాయులు నారాయణ, మల్లేష్, రాంచందర్, అరుణ్, రాంచందర్, దేవిప్రియ, హారిక, సంగీత పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు