ఏ‌పీపీఎస్సీకి ప్రిపేరవుతున్నారా?

8 Apr, 2020 17:37 IST|Sakshi

ఏ‌పీపీఎస్సీలో ఏదైనా ఉద్యోగానికి సిద్దం అయ్యే ముందు కొన్ని కచ్చితమైన పనులు అభ్యర్దన చేయవలసి ఉంటుంది. అవి ఏంటంటే... పరీక్ష సిలబస్ / పాఠ్య ప్రణాళిక. పరీక్షకు ప్రిపేరయ్యేవారు కచ్చితమైన పాఠ్య ప్రణాళికను సిద్దం చేసుకోవాలి. పాఠ్య ప్రణాళిక లో ముఖ్యమైన విషయాలు (టాపిక్స్) ఎప్పటికప్పుడు టిక్ చేసుకొని, వీటినే ముందుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది.కనీసం 30 నుంచి 60 రోజుల సమయాన్ని కేటాయించడం లేదా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక వేసుకోవాలి.అలా, ముఖ్యమైన విషయాలు చదివిన తర్వాత మిగతా సిలబస్ని చదవాలి. అదేవిదంగా, పూర్తి సిలబస్ పై పట్టు వచ్చిన తర్వాత లేదా పూర్తి సిలబస్ అయ్యాక, మళ్ళీ ఒక్కసారి సిలబస్‌ను పూర్తిగా రివిజన్ చేసుకోవాలి.  ఇలా, కచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళితే ప్రభుత్వరంగ ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ఇందులో మీకు ఎటువంటి సందేహం అనవసరం. 

అయితే ఏపీపీఎస్సీ కాలెండర్ 2020లో అసలు ఉద్యోగాలు ఉన్నాయా అనే డౌటు మీకు రావచ్చు.. కానీ కచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి! ఎందుకంటే 2019 సంవత్సరంలో హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌లు చేసిన ప్రకటనతో పాటు రాష్ట ముఖ్యమంత్రి వై‌ఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటన నిరుద్యోగుల్లో ఆశాభావం రేకెత్తించింది. వీరి ప్రకటనను పరిగణలోకి తీసుకుని చూస్తే మొత్తంగా లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తుంది.

AP DSC 2020 Notification
AP Police Constable 2020 Notification
AP SI Police 2020 Notification
AP Sachivalayam Notification 2020
AP Groups Notification 2020 (1, 2, 3, & 4)
AP GENCO AE Notification 2020
AP MLHP Notification 2020
AP Staff Nurse Notification 2020 తదితర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కావున అభ్యర్డులు, ఉన్న సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం.  

ప్రణాళిక సరిగ్గా పాటించడం లేదా? 
కొందరు అభ్యర్థులు సిలబస్ ప్రణాళిక వేసుకున్న తర్వాత కూడా దానిని పాటించడం కష్టంగా బావిస్తారు. అయితే గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలంటే ఆ మాత్రం కష్టపడాల్సిందే. అప్పుడే అనుకున్న ఉద్యోగం / పని సాధించడానికి వీలవుతుంది.

Read latest Advt News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు