ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సురక్షితమే

7 Apr, 2020 16:50 IST|Sakshi

కరోనా వైరస్‌తో దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లడంతో రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లి ఇష్టమైన ఆహారాన్ని తినలేకపోతేన్నామనే భావన ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. రెండువారాలు దిగ్భంధంలో గడిపిన తరువాత కూడా పరిస్థితిలో ఏ మార్పు రాకపోవడంతో లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ బారీన పడకుండా ఉండాలంటే మనమంతా ఇంట్లోనే ఉంటూ, పరిశుభ్రంగా ఉండడమే ఉత్తమమైన మార్గం అని గ్రహించాము. అంతేగాక ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా మా రోజువారీ దినచర్యలను మార్చుకున్నాము.వీటిలో ఇంట్లోకి తీసుకువచ్చే బయటి వస్తువులతో పాటు, ఫుడ్‌ డెలివరీ విషయంలో కూడా అదనపు జాగ్రత్త వహించడం కూడా ఒకటి. ఈ అసాధారణమైన పరిస్థితులలో బయటి నుంచి తీసుకువచ్చే వస్తువుల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందకుండా వాటిని శుభ్రం చేయడంలో జాగ్రత్త వహించాలి.

పలు ఆరోగ్య సంస్థలు నిరంతరం చేతులు కడుక్కోవాలని ప్రజలకు సూచించినప్పటికీ, ఫుడ్‌ డెలివవరీలను ఏ విధంగా నిర్వహించాలనే దానిపై సమాచారం అందుబాటులో లేదు. ఫుడ్‌ డెలివరీ నిర్వహణ విషయంలో అనేక సందేహాలు ఉండడంతో అది అంత సురక్షితం కాదేమోనని ఫుడ్ ఆర్డర్‌ చేయడానికి ప్రజలు భయపడుతున్నారు. కానీ ఫుడ్ ఆర్డర్‌ చేయడం సురక్షితం అని మీకు తెలియడానికి ఎటువంటి భద్రతా చర్యలను అనుసరిస్తున్నామనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాం. అంతేగాక అన్ని సమయాల్లో సూక్ష్మక్రిములు సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న సూపర్‌ మార్కెట్‌కు వెళ్లడం కంటే ఆహారాన్ని మీ ఇంటికే తెప్పించుకోవడం సురక్షితం అని గ్రహించండి. అయితే శానిటరీ టెక్నిక్‌లను ఉపయోగించి మీ ప్యాకేజీలను అన్‌ ప్యాకేజ్‌ చేయడం కూడా అంతే ముఖ్యం.

రెస్టారెంట్లు, హోమ్‌ డెలివరీ విభాగాలు పలు ఆరోగ్య సూత్రాలను అనుసరిస్తూ తమ వినియోగదారులు సురక్షితంగా ఉండడం కోసం ముందడుగు వేశాయి. పరిశుభ్రమైన ఆహారం తయారీ, తాజాగా వండిన భోజనం, చెఫ్‌లు పాటించవలసిన ఆరోగ్య విధానాలు, కాంటాక్ట్‌ డెలివరీ, డోర్‌ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు జాగ్రత్త వహించేలా  రెస్టారెంట్‌ యజమానులు చర్యలు తీసుకుంటారు. కాబట్టి వీటిలో కలుషితానికి తక్కువ ఆస్కారం ఉందని మీకు హామీ ఇస్తున్నాం.

వైరస్‌ సోకకుండా మీ ప్యాకేజీలను సరైన పద్దతిలో ఎలా అన్‌ ప్యాకేజీ చేయాలనేది చూడండి
►మీరు మీ ఫుడ్‌ ప్యాకేజీలను తీసుకున్నపుడు మీకు, డెలివరీ సిబ్బందితో ఎటువంటి కాంటాక్ట్‌ ఉండదని నిర్ధారించుకోండి. 
►ప్యాకేజీని తీసుకునేటపుడు చేతికి తప్పనిసరిగా గ్లౌజులు ధరించండి. 
►మీరు ప్యాకేజీని టేబుల్‌పై ఉంచే ముందు క్రిమి సంహారక మందుతో ఆ ప్రదేశాన్నిశుభ్రంచేయండి. 
►ప్యాకేజీని కూడా అదే వస్త్రంతో శుభ్రం చేయండి. 
►ఇప్పుడు ప్యాకేజీలోని పదార్థాన్ని శుభ్రం చేసిన పాత్రలోకి మార్చి, ప్యాకేజీని చెత్తకుండీలో పడేయండి. 
►తరువాత ఆ చేతులతో మీముఖాన్ని తాకకుండా 20 సెకన్ల పాటు కడుక్కోవాలి. 
►ముందు జాగ్రత్తగా ఆహారాన్ని మీ చేతులతో కాకుండా ఇంటిలోని వస్తువులను ఉపయోగించి తినడం మంచిది. 
►పలు ఫుడ్‌ స్టాండర్డ్‌ ఏజెన్సీలు తాజాగా వండిన, వేడి వేడి ఆహారాన్ని తినడం మంచిదని ప్రజలకు సూచించాయి
►మీ ఆహారాన్ని సుమారు 12 నిమిషాలు వేడిచేసుకోవడం మంచిది.

Read latest Advt News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా