శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం

1 Jan, 2018 02:01 IST|Sakshi
మంగళగిరి డీజీపీ కార్యాలయంలో కొత్త డీజీపీ మాలకొండయ్యకు (కుడి వైపు) పుష్పగుచ్ఛం అందజేస్తున్న మాజీ డీజీపీ సాంబశివరావు

     బాధ్యతలు చేపట్టిన సందర్భంగా డీజీపీ మాలకొండయ్య వెల్లడి

     సాంబశివరావుకు ఘనంగా వీడ్కోలు పలికిన పోలీస్‌ అధికారులు

సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్‌: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తానని నూతన డీజీపీ మన్న మాలకొండయ్య అన్నారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన పూర్తిస్థాయి డీజీపీగా ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు బాధ్యతలు చేపట్టారు. నండూరి సాంబశివరావు నుంచి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. రాష్ట్రంలో తీవ్ర నేరాలను అదుపు చేయడంలో కేసుల నమోదు, అరెస్టులు, దర్యాప్తులు, ప్రాసిక్యూషన్‌ వంటి కీలక విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

సైబర్‌ నేరాలను అదుపు చేసేలా ఇంటెలిజెన్సీ, ఇన్వెస్టిగేషన్‌ తదితర పోలీస్‌ శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా పదవీ విరమణ చేసిన డీజీపీ సాంబశివరావుకు పోలీసు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన∙ తనకు చదువు చెప్పిన గురువులను తలచుకుంటూ ఉద్వేగానికి గురయ్యారు. 

మరిన్ని వార్తలు