కృష్ణపట్నంలో ఆయిల్‌ రిఫైనరీ పెట్టండి

24 Jan, 2018 01:18 IST|Sakshi

ముఖ్యమంత్రి చంద్రబాబు

సాక్షి, అమరావతి: కృష్ణపట్నంలో ఆయిల్‌ రిఫైనరీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సౌదీ ఆర్మ్‌కో సంస్థ ప్రెసిడెంట్‌ను సైద్‌ అల్‌ హద్ర మీని కోరగా ఆయన సంసిద్ధత వ్యక్తం చేశా రు. దావోస్‌ పర్యటనలో రెండోరోజు మంగ ళవారం సీఎం సౌదీ ఆర్మ్‌కో ప్రెసిడెంట్‌తో సమావేశమయ్యారు. తమ రాష్ట్రాన్ని తాకు తూ రెండు పారిశ్రామిక కారిడార్లున్నాయని, కృష్ణపట్నాన్ని లాజిస్టిక్‌ హబ్‌గా తీర్చిదిద్దు తామని, ఆయిల్‌ రిఫైనరీ ఏర్పాటు వాణిజ్య పరంగా ఎంతో లాభసాటి అవుతుందని చంద్రబాబు చెప్పారు. కృష్ణపట్నంలో ఆయి ల్‌ రిఫైనరీ ఏర్పాటు ప్రతిపాదనపై గతంలోనే చర్చించిన నేప థ్యంలో ఈ నెలాఖరులో ముంబై లో తమ ప్రతినిధులతో సంప్ర దించాలని హద్రమీ సూచిం చారు. ఫిబ్రవరిలో విశాఖలో నిర్వహించనున్న సీఐఐ సదస్సుకు హాజ రవాలని హద్రమీని సీఎం ఆహ్వానించారు.

పలువురితో సీఎం భేటీ..
కాగా మిడ్‌టెక్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ప్రతి నిధులతో సీఎం సమావేశమై గతేడాది కుదు ర్చుకున్న ఒప్పందంపై చర్చించారు.  ఏజిల్‌ లాజిస్టిక్స్‌ సీఈవో తరక్‌ సుల్తా అల్‌ ఎస్సా, డైరెక్టర్‌ ఉగెన్‌ మెన్‌తో, హిటాచీ ప్రెసిడెంట్‌ తొషైకీ హిగషిహరతో సీఎం భేటీ అయ్యారు. 

మరిన్ని వార్తలు