గణతంత్ర దినోత్సవం..గవర్నర్‌ శుభాకాంక్షలు

25 Jan, 2018 22:35 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభసమయంలో మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో అమరవీరులను, త్యాగమూర్తులను స్మరించుకుందామన్నారు. ఆ మహనీయుల ఆశయాల సాధనకు మనందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాల వారికి సమంగా అందాలని అన్నారు. బాధ్యత గల పౌరులుగా మనందరం సమిష్టిగా శ్రమించాలన్నారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్‌ సాధన లక్ష్యంతో అహర్నిశం, అనుక్షణం కృషి చేద్దామని చెప్పారు.

మరిన్ని వార్తలు