ఏళ్లు గడుస్తున్నా నీరివ్వరేం?

21 Jan, 2018 07:40 IST|Sakshi

హంద్రీ–నీవా అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని సూచన

ఉరవకొండ నియోజకవర్గంలోని ఆయకట్టుకు మార్చిలోగా నీరివ్వాలని డిమాండ్‌

సాక్షి, అనంతపురం‌: హంద్రీ–నీవా ప్రాజెక్ట్‌ కింద ఉన్న ఆయకట్టుకు నీటి ని అందించడంలో టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. దివంగత ముఖ్య మంత్రి వైఎస్‌ రాజశేఖరెడ్డి హయాంలో 80 శాతా నికి పైగా పనులు పూర్తయ్యాయని, అలాంటిది ఈ మూడేళ్లలో కనీసం స్ట్ర క్చర్లు కూడా నిర్మించలేని దౌర్బాగ్య పరిస్థితిలో టీడీ పీ ప్రభుత్వం ఉందన్నారు. హంద్రీ–నీవా ప్రాజెక్ట్‌ పురోగతిపై శనివారం స్థానిక హంద్రీ–నీవా కార్యాలయంలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఎస్‌ఈ రామకృష్ణారెడ్డితో కలిసి ఆ యన మూడు గంటల పాటు సమీక్షించారు. 

అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ఏమైంది?
‘ఉరవకొండ నియోజకవర్గంలోని హంద్రీ– నీవా ఆయకట్టుకు నీటి విడుదల అంశాన్ని గతేడాది అసెంబ్లీలో లేవనెత్తాం. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. మార్చిలోగా హంద్రీ–నీవా ఆయకట్టుకు నీరిస్తామంటూ అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు హామీనిచ్చారు.  అయితే పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. ఆయకట్టు స్ట్రక్చర్‌ పనులే ప్రారంభించకుండానే మార్చి నాటికి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం సాధ్యమవుతుందా?’ అని ఎస్‌ఈని ప్రశ్నించారు.  

ఎక్కడి పనులు అక్కడేనా?
‘33వ ప్యాకేజీ పనులు గిట్టుబాటు కావడం లేదని కాంట్రాక్టర్లు పనులు నిలిపేస్తే.. అదనపు రేట్లకు టెండర్లు ఇచ్చుకుంటూ ప్రజాధనం లూటీ చేస్తున్నారే తప్ప పనుల్లో పురోగతి చూపడం లేదు. మొత్తం 11 స్ట్రక్చర్లకు గాను ఐదింటిని మాత్రమే పూర్తి చేశారు. ఒక కిలోమీటర్లు  కాలువ బ్లాస్టింగ్‌ చేయాల్సి ఉందన్నారు. 17 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సిన 34వ ప్యాకేజీలో 45 స్ట్రక్చర్లు నిర్మించాల్సి ఉంది. ఈ పనులన్నీ ఎప్పటికి పూర్తి చేయగలుగుతారు. పని చేయని కాంట్రాక్ట్‌ సంస్థలను వెంటనే బ్లాక్‌లిస్టులో పెట్టండి. అవసరమైతే బ్యాంక్‌ బ్యాలెన్స్‌ రూ. 5 కోట్లను జప్తు చేయండి. 36వ ప్యాకేజీలో జీడిపల్లి రిజర్వాయర్‌ ద్వారా మొత్తం 80 వేల ఎకరాలకు నీరివ్వాల్సి ఉంది. మిగిలిపోయిన పనులకు రూ.55 కోట్లతో చేయాల్సి ఉండగా రూ. 275 కోట్లు పెంచుకుని కొత్త కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. పనులు ఎక్కడా చేపట్టకపోతే అధికారులుగా మీరేమి చేస్తున్నారు’ అంటూ నిలదీశారు. 

అన్ని చెరువులకు నీళ్లివ్వాలి
ఆమిద్యాల లిప్ట్‌ పనులకు వెంటనే టెండర్లు పిలవడంతో పాటు హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా ఉరవకొండ నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీళ్లివ్వాలని డిమాండ్‌ చేశారు. వజ్రకరూరు నుంచి గుంతకల్లు వరకు గ్రావిటీ ద్వారా నీటిని తరలించి 13 చెరువులను నింపాలన్నారు. ఈ పనులు చేపట్టాలని సూచించారు. అవసరమైతే మొబైల్‌ లిప్ట్‌లు తెప్పించి మెయిన్‌ కెనాల్‌ నుంచి చెరువులకు నీటిని తరలించాలని కోరారు. రైతులకు లబ్ధి చేకూర్చేందుకు సమష్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. 

నిధుల దోపిడీకే టెండర్లు
హంద్రీ–నీవా మొదటి దశలో ఐదు శా తం పనులు మాత్రమే పూర్తి చేస్తే ఆయకట్టుకు నీరివ్వచ్చునని విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ మూడేళ్లలో ఒక్క ఎకరాకు కూడా నీరివ్వకుండా ఉరవకొండ నియోజకవర్గ రైతులను మోసం చేసి కు ప్పంకు నీటిని తీసుకుపోవడానికి ప్రత్నిం చిన చంద్రబాబు,  ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బైరవాని తిప్ప ప్రాజెక్టు, పేరూరు డ్యాంలకు నీళ్లిస్తామం టూ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉం దని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికలకు డ బ్బులు దాచుకునేందుకు ఈ పనులకు టెండర్లు పిలుస్తున్నారని, గ్రావిటీ ద్వారా నీళ్లిచ్చే అవకాశాలు ఉన్నా లిఫ్ట్‌లు పెడు తూ రూ. వందల కోట్లు దోచుకునేందుకు కుట్రలు చేశారని విమర్శించారు.

Read latest Ananthapur News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు