ఈసారీ మౌనమే

22 Jan, 2018 07:30 IST|Sakshi

రిపబ్లిక్‌డే రోజూ  విడుదల లేనట్టే

జీఓ విడుదలపై ఊసెత్తని రాష్ట్ర ప్రభుత్వం

జీవిత ఖైదీల ఆశలు నిరాశే

క్షణికావేశంలో నేరం చేసి.. కఠినకారాగార శిక్ష అనుభవిస్తూ కుటుంబ సభ్యులకు దూరమైన వారు క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వీరికి క్షమాభిక్ష ప్రసాదించేందుకు ప్రభుత్వం మాత్రం మొగ్గు చూపడం లేదు. గణతంత్ర దినోత్సవం రోజున విడుదల చేయాల్సిన జీవిత ఖైదీల విషయంలో ఇప్పటి వరకూ జీఓ ఊసే లేదు. దీంతో జీవిత ఖైదీలకు ఈసారి కూడా నిరాశే ఎదురవుతోంది.

అనంతపురం, బుక్కరాయసముద్రం: జిల్లాలోని రెడ్డిపల్లి ఓపెన్‌ ఎయిర్‌ జైలు (ఆరుబయలు కారాగారం)లో మొత్తం 62 మంది ఖైదీలున్నారు. వీరిలో ఏడు సంవత్సరాల శిక్షతో పాటు మూడు సంవత్సరాలు రెమ్యూనేషన్‌ కలిపి మొత్తం 10 సంవత్సరాలు శిక్ష అనుభవించిన వారు 40 మంది వరకు ఉన్నారు. క్షమాభిక్ష జీఓ విడుదల చేస్తే బయటకు వెళ్లేందుకు వీరంతా అర్హులే.

విడుదల కోసం నిరీక్షణ
సాధారణంగా గణతంత్రదినోత్సవం (జనవరి 26), స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్ట్‌ 15), గాంధీ జయంతి (అక్టోబర్‌ 2) రోజున అర్హులైన జీవిత ఖైదీలకు ‘క్షమాభిక్ష’ ద్వారా విడుదల చేయాల్సి ఉంది. క్షమాభిక్ష జీఓ కోసం జీవితఖైదీలు నిరీక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెలువడే శుభవార్త కోసం కళ్లలో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. 

జీఓపై ఊసెత్తని ప్రభుత్వం
జీవిత ఖైదీల క్షమాభిక్షపై రాష్ట్ర సర్కార్‌ ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. గత కాంగ్రెస్‌ హయాంలో అప్పటి ముఖ్య మంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడంతో ఓపెన్‌ ఎయిర్‌ జైలు నుంచి 150 మంది విడుదలయ్యారు. ప్రస్తుత ప్రభు త్వం జీఓ మార్గదర్శకాల కనీసం పరిశీలించి న దాఖలాలు లేవని తెలుస్తోంది. ప్రభు త్వం స్పందించి పదేళ్ల శిక్ష పూర్తి చేసుకొన్న అర్హులైన ఖైదీలందరికీ క్షమాభిక్ష ప్రసాదించాలని పలువురు ఖైదీలు కోరుతున్నారు.

అర్హుల జాబితాలో సిద్ధం
ఓపెన్‌ ఎయిర్‌ జైలులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న ఖైదీల క్షమా భిక్షకు అర్హులైన జాబితా సిద్ధం చే సుకు ని ఉంచాము. జీఓ విడుదల ప్రభు త్వం చేతుల్లో ఉంది. ఇప్పటి వరకు క్షమాభిక్ష జీఓ విడుదల కాపీ లు అం దలేదు. ప్రభుత్వం ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించినట్లయితే నెల రోజుల ముందు ఓపెన్‌ ఎయిర్‌ జైలుకు సమాచారం వస్తుంది. ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారమూ రాలేదు.
– నాగేశ్వరరావు, ఓపెన్‌ ఎయిర్‌ జైలు ఇన్‌చార్జి సూపరింటెండెంట్, రెడ్డిపల్లి

మరిన్ని వార్తలు