అవినీతి సిబ్బందిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు

20 Dec, 2013 04:42 IST|Sakshi

చిత్తూరు(గిరింపేట), న్యూస్‌లైన్: సింగిల్‌విండోల్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సిబ్బంది, వారి కి పరోక్షంగా సహకరించిన అధికారుల ను ఇంతవరకు సస్పెండ్ చేయకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నారని కలెక్టర్ రాం గోపాల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారులు, జిల్లా సహకార శాఖ అధికారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం సహకార శాఖలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన పెండింగ్ కేసులపై డీసీసీబీ, ఆడిట్, పరి పాలన విభాగాలకు చెందిన  ముఖ్యమైన అధికారులు, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఆయన మా ట్లాడుతూ జిల్లాలోని 75 శాతం సింగిల్‌విండోల్లో సిబ్బంది, అధికారుల వల్లే నిధులు దుర్వినియోగమయ్యాయని తే లినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సహకార శాఖ అధికారిని ప్రశ్నిం చారు. ఎగ్జిక్యూటివ్ పిటిషన్లు వేసి వారి నుంచి నిధులు ఎందుకు రాబట్టడం లేదని మండిపడ్డారు. 1985 నుంచి అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నా ఎలాం టి చర్యలు లేవంటే మీరెలా పనిచేస్తున్నారో అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు దుర్వినియోగం చేసిన వారు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకునేంతవరకు సమయమిస్తూ, వారిని మీరే రక్షించే ప్రయత్నం చేస్తున్నారని నిలదీ శారు.

పూతలపట్టు సింగిల్‌విండోలో 1990 నుంచి 2000 మధ్య లక్షలాది రూ పాయలు దుర్వినియోగమయ్యాయని, అందుకు బాధ్యులైన వారిని ఇంతవరకు ఏమీ చేయలేకపోయారన్నారు. చి త్తూరు టౌన్ బ్యాంకులో అప్పటి చైర్మన్ రూ.21 లక్షలు, సీఈవో రూ.22 లక్షలు దుర్వినియోగం చేసినట్లు ఆధారాలు ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఒకటి రెండు రోజుల్లో అవినీతికి పాల్పడిన వారిని సస్పెండ్ చేయాలని, తద్వారా మిగిలిన వారికి భయం కలుగుతుందని ఆదేశించారు.

సింగిల్‌విండోల్లో రుణాలు తీసుకుని ఎంతకూ చెల్లించని వారి జాబితా తయారు చేసుకుని పోస్టర్లు, కరపత్రాలు ముద్రించి ఆయా మండలా లు, ప్రాంతాల్లో పంచితే చాలా వరకు రుణాలు రికవరీ అవుతాయన్నారు. 15 రోజుల్లో దీనిపైనే మళ్లీ రివ్వూ పెట్టుకుంటానని, ఈలోగా పెండింగ్ కేసుల్లో పురోగతి కనిపించకపోతే చర్యలు మరోలా ఉంటాయని హెచ్చరించారు.
 

>
మరిన్ని వార్తలు