11 నుంచి వైశాఖి నృత్యోత్సవ్

9 Sep, 2014 01:29 IST|Sakshi

విశాఖపట్నం-కల్చరల్ : నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వైశాఖి నృత్యోత్సవ్ పేరిట ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అఖిల భారత శాస్త్రీయ నృత్యోత్సవా లు ఈనెల 11 నుంచి నాలుగు రోజులపాటు రసజ్ఞ ప్రేక్షకులను అల రించనున్నాయి. ప్రతి రోజు సాయంత్రం 6.30 గంటలకు కళాభారతి ఆడిటోరియం లో ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

తొలి రోజున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి కళాకారులు రాజారెడ్డి, రాధారెడ్డినాట్య ప్రదర్శన ఇవ్వనున్నారు. విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. డాక్టర్ రాజారెడ్డి దంపతులను వైశాఖి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించనున్నారు.
 
12న న్యూఢిల్లీకి చెందిన పద్మ శ్రీ రంజనా గౌర్(ఒడిస్సీ), కేరళలోని త్రిచూర్‌కు చెందిన పద్మశ్రీ క్షేమవతి మోహినీ యా ట్టం, 13న చెన్నై నగరానికి చెందిన పద్మభూషణ్ ధనుంజయ్, శాంతా ధనుంజయన్ దంపతుల భరతనాట్యం ఏర్పాటు చేయనున్నారు. ఉత్సవాల ముగింపు రోజైన 14న ప్రఖ్యాత కూచిపూడి నాట్య కళాకారిణి మంజుభార్గవి, హైదరాబాద్‌కు చెందిన దీ పికారెడ్డి బృందం కూచిపూ డి నృత్య నాటక ప్రదర్శనలు ఉంటాయి. ఏడేళ్ల నుంచి ఏటా సెప్టెంబర్‌లో క్రమం తప్పకుండా నృత్యోత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రవేశం ఉచితమని న టరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ అధ్యక్షుడు బి.విక్రమ్‌గౌడ్ చెప్పారు.
 
12 నుంచి 14 వరకు కల్చరల్ జర్నలిజంపై వర్క్‌షాపు

 పత్రికా రచన-భారతీ య శాస్త్రీయ నృత్యాలు (జ ర్నలిజం-ఇండియన్ క్లాసికల్ డ్యాన్సెస్) అనే అంశంపై అనుభవజ్ఞులతో విజ్ఞాన్ విశ్వవిద్యాలయంతో కలసి ఔత్సాహిక పత్రిక రచయితలకు సెమినార్ కమ్ వర్క్‌షాపు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సెమినార్ సిరిపురం కూడలి సమీపాన ఎస్‌పీ బంగ్లా పక్కనగల విజ్ఞాన్ గ్లోబల్ స్కూల్ ప్రాంగణంలో రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరుగుతుందని తెలిపారు.
 

మరిన్ని వార్తలు