వి.కోట (చిత్తూరు): చిత్తూరు జిల్లా వి. కోట మండలంలో దారుణం చోటుచేసుకుంది. మండలంలోని బండపల్లి గ్రామంలో పదేళ్ల చిన్నారిని దారుణంగా హతమార్చి కొండ పైన ఉన్న బండల చీలికలో పడేశారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుడు గ్రామానికి చెందిన రిజ్వాన్ (10) గా గుర్తించారు. కాగా హత్యకు గల కారణాలు తెలియరాలేదు.