వెయ్యి టీఎంసీల గోదావరి నీరు మళ్లింపు

8 May, 2015 02:32 IST|Sakshi
వెయ్యి టీఎంసీల గోదావరి నీరు మళ్లింపు

చిత్తూరు జిల్లా అంగళ్లు
రైతు సదస్సులో సీఎం చంద్రబాబు

 
బి.కొత్తకోట: వృధాగా సముద్రంలో కలుస్తున్న 3వేల టీఎంసీల  గోదావరి జలాల్లో 1,000 టీఎంసీల నీటిని మళ్లించి కరు వు ప్రాంతాలను ససశ్యామలం చేస్తామని సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు ప్రకటిం చారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం అంగళ్లులో గురువారం రాత్రి రైతు సదస్సు జరిగింది. ఈ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ తుంగభద్ర, గోదావరి నదుల ఎగువభాగంలో ప్రాజెక్టుల నిర్మాణాల కారణంగా రాష్ట్రంలోకి రావాల్సిన నీటికి అడ్డంకులు కలుగుతున్నాయని, పెన్నానది ఎండిపోయి నీటి ఇబ్బందులు అధికమయ్యాయని చెప్పారు.

ఇందులో భాగంగానే వృధా జలాల్లో 1,000 టీఎంసీల నీటిని కృష్ణా, పెన్నా నదులతోపాటు రాష్ట్రంలోని అన్ని నదులకు అనుసంధానం చేస్తామన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌లకు, 1,500 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమున్న చెరువులకు మళ్లిస్తామని చెప్పారు. తద్వారా రెండే ళ్లపాటుకరువు దరికిచేరదని అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు మరో నాలుగైదు సంవత్సరాలు పడుతుందని, ఈలోగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. గోదావరి నీటిమట్టం 14మీటర్లు ఉంటేనే ఎత్తిపోతలకు నీటిని మళ్లిస్తామని, 14 మీటర్లకు తగ్గితే కాలువల ద్వారా రైతులకు నీటిని అందిస్తామన్నారు. గాలేరు-నగిరి, సోమశిల-స్వర్ణముఖి, హంద్రీ-నీవా ప్రాజెక్టులను పూర్తిచేస్తామని చెప్పారు. కాగా తెట్టు అనే గ్రామం పులగూరవాండ్లపల్లె హంద్రీ-నీవా ప్రాజెక్టు పుంగనూరు బ్రాంచి కెనాల్ గట్టుమీద బస్సులో నిద్రించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, అర్ధరాత్రి వరకు ఇంకా అక్కడికి చేరుకోలేదు.
 

శిశు మరణాలను తగ్గించండి
తిరుపతి: శిశు, గర్భిణుల మరణాలు తగ్గించడాన్ని సవాలుగా తీసుకుని పని చేయాలని ఏఎన్‌ఎంలు, ఆరోగ్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. గురువారం తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలోని ఆడిటోరియంలో పెంటావాలెంట్ టీకాను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

మరిన్ని వార్తలు