106వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

7 Mar, 2018 09:30 IST|Sakshi

సాక్షి, ఒంగోలు : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 106వ రోజు ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. బుధవారం ఉదయం ఆయన ఇంకొల్లు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం హనుమోజిపాలెం చేరుకుంటారు. అక్కడ జనంతో వైఎస్‌ జగన్‌ మమేకం అవుతారు. ఆ తర్వాత జరుబులపాలెం, కొడవలివారిపాలెం మీదుగా కేశరపుపాడు చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం రంగప్పనాయుడు పాలెం క్రాస్‌, నందిగుంటపాలెం మీదుగా సంతరావూరు చేరుకుంటారు. అక్కడ ప్రజలను కలుసుకొని సమస్యలను తెలుసుకుంటారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 1,429.4 కిలోమీటర్లకు చేరుకుంది.

మరిన్ని వార్తలు