పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపున కు 21 వరకు గడువు

2 Oct, 2013 02:05 IST|Sakshi
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: 2013-14 విద్యాసంవత్సరానికి  పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 21లోగా  పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈవో ఎస్.అరుణకుమారి కోరారు. రెగ్యులర్ విద్యార్థులు, మూడు సబ్జెక్టులు కంటే ఎక్కువ సబ్జెక్టులు రాయాలను కునేవారు రూ.125, మూడు, అంతకంటే తక్కువ సబ్జెక్టులకు హాజరయ్యేవారు రూ.110 చెల్లించాలని, రెగ్యులర్ ప్రైవేటు, ఇతర రాష్ట్ర విద్యార్థులు నిబంధనల మేర ఫీజులు చెల్లించాల్సి ఉందన్నారు. రూ. 50 అపరాధ రుసుంతో నవంబర్ 4వరకు, రూ. 200తో నవంబర్ 18 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 2 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. 
 
 విద్యార్థుల నుంచి ఆయా తేదీల్లో వసూలు చేసిన ఫీజులను సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలు ఆ మరుసటి రోజే ట్రెజరీల్లో జమచేయూలన్నారు. ప్రైవేటుగా పరీక్షలు రాయూలనుకునేవారు, ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు హాజరుమినహాయింపు కోసం రూ. 650 అదనంగా ఫీజు చెల్లించాలన్నారు. నామినల్ రోల్స్‌తో పాటు పాఠశాలల్లో ఉపాధ్యాయుల వివరాలు జిల్లా డీఈఓ వెబ్‌సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్యూ.ఎస్‌కెడీఈఓ.ఇన్)లో నమోదుచేయాలన్నారు. ఆ వివరాలతో ధ్రువీకరించిన ప్రింటెడ్ కాపీలను, విద్యార్థుల నామినల్ రోల్స్‌తో పాటు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి అందజేయాలని అరుణకుమారి సూచించారు. 
 
మరిన్ని వార్తలు