సోమశిల జలాశయంలో 12.2 టీఎంసీల నీరు

3 Apr, 2015 02:59 IST|Sakshi

పొట్టదశలో వరి ఆందోళనలో రైతులు
 
సోమశిల : సోమశిల జలాశయంలో ప్రస్తుతం 12.249 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి ఉత్తర కాలువకు 450, దక్షిణ కాలువకు 100 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. అధికారులు ఈ నెల 10వతేదీ లోగా డెల్టా, నాన్‌డెల్టాకు నీటి నిలుపుదల చేసే యోచనలో ఉన్నారు.

మొదటి పంటకు ఇంకా మరో 20 రోజుల దాకా నీరు కావాలని రైతులు కోరుతున్నారు. ఉత్తర కాలువ పరిధిలో సుమారు రెండు వేల ఎకరాలు ఇంకా పంట పొట్ట దశలోనే ఉంది. అలాగే దక్షిణ కాలువ కింద వెయ్యి ఎకరాలు ఉంది. మరో 20 రోజులైనా నీరు ఇవ్వకపోతే అధిక శాతం మంది రైతులకు కచ్చితంగా పంట చేతికి రాదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు జలాశయం డెడ్ స్టోరేజ్‌కి చేరుకుంటోంది.

ఇంకా వేసవి మరో నాలుగు నెలలు ఉంది. ఈ లెక్కన జిల్లా ప్రజలకు తాగునీటికి కూడా కష్టాలు వచ్చేలా ఉన్నాయి. తాగునీటి సమస్య తీవ్రమయ్యేలోపే జిల్లా యంత్రాంగంప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని వార్తలు