13 లేదా 15న కొత్త కలెక్టర్ బాధ్యతలు!

10 Jul, 2014 00:34 IST|Sakshi
13 లేదా 15న కొత్త కలెక్టర్ బాధ్యతలు!

విశాఖ రూరల్: జిల్లా కలెక్టర్‌గా నియమితులైన డాక్టర్ ఎన్.యువరాజ్ ఈ నెల 13న లేదా 15న బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. వుడా వైస్‌చైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తున్న యువరాజ్ ప్రస్తుతం సెలవుపై తమిళనాడులో ఉన్నారు. ఆయన ఈ నెల 12న జిల్లాకు రానున్నారు. వీలైనంత వరకు ఈ నెల 13వ తేదీన కలెక్టర్‌గా చార్జ్ తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆరోజు కాని పక్షంలో 15వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిసింది. ప్రస్తుత కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ కూడా 13నే రిలీవ్ కానున్నట్టు సమాచారం.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు