కరోనా.. వైఎస్సార్‌ జిల్లాలో 13 మంది డిశ్చార్జ్‌

16 Apr, 2020 13:31 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ : జిల్లాలో 13 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నారు. పలుమార్లు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ రిపోర్ట్‌ రావడంతో వారిని డిశ్చార్జ్‌ చేయాలని వైద్యులు నిర్ణయించారు. దీంతో 17 రోజులుగా కోవిడ్‌ ఆస్పత్రిలో చికిత్సపొందిన వీరు గురువారం డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన 13 మందికి డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా పౌష్టికాహార సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంజాద్‌ బాషాతోపాటు జిల్లా కలెక్టర్‌ హరి కిరణ్‌, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ మేయర్‌ సురేష్‌ బాబు పాల్గొన్నారు. 

చికిత్స అనంతరం 13 మంది కరోనా బాధితులు కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌ రావడంపై అధికార యంత్రాంగం ఆనందం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు జిల్లాలో 36 కరోనా కేసులు నమోదుకాగా.. నేడు 13 మంది డిశ్చార్జ్‌ కావడంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 23కు తగ్గింది. 

చదవండి : క్వారంటైన్‌ నుంచి వెళ్లేటప్పుడు రూ. 2,000 సాయం

ఏపీ : రెండో విడత రేషన్‌ పంపిణీ ప్రారంభం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు