13% మద్యం దుకాణాల మూసివేత

2 Jun, 2020 04:16 IST|Sakshi

రాష్ట్రంలో మద్య నియంత్రణ దిశగా మరో కీలక అడుగు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించడంలో భాగంగా మరో కీలక అడుగు పడింది. ఏపీలో ప్రస్తుతం ఉన్న మద్యం షాపులను తగ్గించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా సోమవారం నుంచి మరో 13 శాతం మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో ఏడాదిలోనే ప్రభు త్వం 33 శాతం మద్యం షాపులను తగ్గించి నట్లైంది. టీడీపీ హయాంలో ఉన్న 4,380 మద్యం షాపులు ఇపుడు 2,934కు తగ్గిపోయా యి. అంటే  ఏడాది కాలంలో 1,446 షాపు లను తగ్గించారు. మద్యం విక్రయాలు ఎక్కువగా జరిగే షాపులను, అద్దెలు ఎక్కువగా ఉన్న షాపు లను ప్రభుత్వం మూసివేయడం గమనార్హం.

ప్రకాశం జిల్లాలో అత్యధికంగా మూత
► వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా 43 వేల బెల్టు షాపులను తొలగించిన సంగతి తెలిసిందే. మద్యం వినియోగాన్ని తగ్గించడం ద్వారా ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలను తీసుకుంది.
► గతేడాది ఆగస్టులో 20 శాతం మద్యం షాపులను తగ్గించారు. అప్పట్లో 4,380 మద్యం షాపులుండగా 20 శాతం మేర (880) తగ్గించడంతో 3,500 దుకాణాలకు పరిమితమయ్యాయి. అయితే వీటిలో 3,469 దుకాణాలే పనిచేస్తున్నాయి. 
► తాజాగా మరో 13 శాతం(535) మద్యం షాపులను తగ్గించడంతో ఏడాదిలోనే మొత్తం 33 శాతం తగ్గించినట్లైంది. తద్వారా ఇక 2,934 మద్యం దుకాణాలే మిగిలాయి.
► అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 91 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు