కర్నూలులో పెరుగుతున్న కరోనా కేసులు..

18 Apr, 2020 18:46 IST|Sakshi

శాంపిల్స్‌ సేకరణకు 10 ప్రత్యేక బృందాలు

కలెక్టర్‌ వీరపాండియన్‌

సాక్షి, కర్నూలు: జిల్లాలో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. మొత్తం 130 కరోనా కేసులు నమోదయినట్లు వెల్లడించారు. ఒకరు డిశ్చార్జ్‌ కాగా, నలుగురు మృతి చెందారని వెల్లడించారు. 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి శాంపిల్స్‌ను సేకరిస్తున్నామని పేర్కొన్నారు. 1425 శాంపిల్స్‌ రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. జిల్లాలో కరోనా టెస్టింగ్‌ ల్యాబ్‌ ఈ రోజు నుంచే ప్రారంభమయిందని తెలిపారు.

ఢిల్లీ జమాత్‌లో పాల్లొన్నవారిలోనే ఎక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. కరోనా బారినపడి ఒక వైద్యుడు మృతి చెందారని.. ఆసుపత్రికి వెళ్లిన వారిపై దృష్టి పెట్టామన్నారు. వైద్యుడిని కలిసిన 213 మంది పైమరీ కాంటాక్ట్స్ ను గుర్తించామని.. అందులో 13 మందికి పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. సెకండరీ కాంటాక్ట్‌ అయిన 900 మందిని గుర్తించామని.. వారికి కూడా టెస్ట్‌లు నిర్వహిస్తామని కలెక్టర్‌ వీరపాండియన్‌ వెల్లడించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు