చెవిరెడ్డికి రిమాండ్, కడప జైలుకు తరలింపు

9 Jul, 2016 13:20 IST|Sakshi

చిత్తూరు : సబ్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా  2013లో రామచంద్రాపురం మండలం అనుప్పల్లి పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ఎన్నికల నియామావళి ఉల్లంఘనగా పరిగణించి అప్పట్లో పోలీసులు చెవిరెడ్డిపై కేసు నమోదు చేశారు.

రామచంద్రాపురం పోలీసులు గురువారం చెవిరెడ్డిని అరెస్ట్ చేసి వడమాలపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిన్న ఆయనను పుత్తూరు కోర్టులో హాజరు పరచగా, 15 రోజులు రిమాండ్ విధించింది.  అయితే బెయిల్పై ఈ రోజు ఉదయం చిత్తూరు సబ్ జైలు నుంచి విడుదల అయిన చెవిరెడ్డిని వెంటనే ఎంఆర్ పల్లి పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు.

మరిన్ని వార్తలు