తొమ్మిదేళ్లలో 14 మంది బలి

28 Nov, 2016 03:13 IST|Sakshi
 సీతంపేట:  ఒకటి కాదు రెండు తొమ్మిదేళ్లుగా ఏనుగులు మన్యం ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నారయి. ఆస్తులకు నష్టం చేకూరుస్తున్నా యి. ఎదురు పడిన వారి ప్రాణాలు తీస్తున్నా యి. ఇంత జరుగుతున్నా... అధికారుల్లో చల నం లేదు. వాటి తరలింపునకు చర్యలు తీసుకోవడంలేదంటూ గిరిజనులు మండిపడుతున్నారు. భయంభయంతో బతుకుతున్నారు.  2007 సంవత్సరంలో ఒడిశా లఖేరీ అడవుల నుంచి వచ్చిన ఏనుగుల గుంపు ఇప్పటి వర కు 14 మందిని చంపేశారుు. సీతంపేట, హిరమండలం, కొత్తూరు, ఎల్.ఎన్.పేట, పాతపట్నం మండలాల్లో సంచరిస్తూ వందలాది ఎకరాల్లోని పంటలను ధ్వంసం చేసి రైతులకు నష్టాన్ని మిగిల్చారుు. 
 
 ఏనుగుల నష్టాలు ఇలా... 
 2007 డిసెంబర్ 14న సీతంపేట మండలం చినబగ్గకు చెందిన పసుపురెడ్డి అప్పారావును, దోనుబారుు గ్రామానికి చెందిన సిరిపోతుల మేరమ్మను కోదుల వీరఘట్టం వద్ద ఏనుగులు మట్టుపెట్టాయి. అదే నెల 19న కుంబిడి నాగరాజు అనే వీరఘట్టానికి చెందిన పాత్రికేయుడిని హుస్సేన్‌పురం వద్ద దారుణంగా హతమార్చాయి. 21న ఇదే మండలం సంతనర్సిపురం వద్ద తెంటు శ్రీనివాసరావును విచక్షణారహితంగా చెట్లకు విసిరికొట్టి మాంసం ముద్దను చేశాయి. ఏడాది కాలం వ్యవధి తర్వాత వీరఘట్టం మండలం చలివేంద్రి వద్ద కొండగొర్రె సాంబయ్యను కూడా ఇదే తరహా లో ఏనుగులు పొట్టనపెట్టుకున్నారుు. అటు తర్వాత ఏడాది, రెండేళ్లకొక మారు ఒకరిద్దరిని చంపేయడం రివాజుగా మారింది. వ్యవసాయ పనులకు వెల్లిన వారిని చాలా మందిని ఏనుగులు పొట్టన బెట్టుకోవడంతో ఆ కుటుం బాలన్నీ దిక్కుతోచని స్థితిలో రోడ్డున పడ్డాయి. ఇదే క్రమంలో వందలాది ఎకరాల్లో పంట కూడా ధ్వంసమౌతుంది. పంటలను కాపాడుకునే క్రమంలో గిరిజనులు మృత్యువాత పడుతున్నారు. 
 
 శ్రీకాకుళం జిల్లాపై చిన్నచూపు 
 కొద్ది నెలల కిందట ఆపరేషన గజా పేరుతో విజయనగరం జిల్లాలోని ఒక గున్న ఏనుగు ను, చిత్తూరు జిల్లాలోని రారుువరం పరిధిలో మరో ఏనుగును జంతు ప్రదర్శన శాలలకు తరలించారు. శ్రీకాకుళం ఏజెన్సీలో తొమ్మిదేళ్లుగా ఏనుగులు సంచరిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. కనీసం ప్రభుత్వం నుం చి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీడీఏలో జరిగిన పాలకవర్గ సమావేశానికి వచ్చిన మంత్రులు ఏనుగులు తరిమేస్తామని, సమస్య పరిష్కరిస్తామని, సీఎం దృష్టికి తీసుకెళ్తామన్న ప్రకటనలు శూన్యమే అయ్యాయి. 
 
మరిన్ని వార్తలు