అమ్మా.. నేనే ఎందుకిలా..!

29 Oct, 2019 08:07 IST|Sakshi
తల్లిదండ్రులతో భవాని

చిరుప్రాయంలోనే కేన్సర్‌ కాటు బడికెళ్లే వయసులో బతుకంటే భయం భయం భవిత వైపు అడుగులు పడుతున్న వేళ... విధి లీల కన్నకూతురి కోసం తల్లడిల్లుతున్న కన్నపేగులు  ఆర్థిక సాయం కోసం ఎదురు చూపులు చెంగుచెంగున లేడిపిల్లలా గంతులేయాల్సిన...వీధుల్లోనూ, క్రీడా మైదానంలోనూ ఆటలాడాలి్సన వయసుబడి గంట మోగగానే ఇంటికి పరుగులు తీసి,అమ్మకు తోడుగా పనిలో సాయం చేసే మంచి మనసు చదువుపైనే ధ్యాస పెట్టి... ఉన్నతస్థానాలు అధిరోహించి భవితకు బంగారు బాటలేసుకొనే తరుణం కానీ...ఎందుకిలా...నాతో కలిసి తిరిగే నా స్నేహితులు దూరమవుతున్నారునా చుట్టూ ఉండేవారంతా జాలి చూపులు చూస్తున్నారుఆటకు వెళ్తే వద్దంటూ వారిస్తున్నారు.పుస్తకాల సంచి భుజాన వేసుకుంటే ఇంకొకరు సాయంఆయాసం వస్తే అందరిలో అదిరిపాటుఅమ్మా...ఏమవుతోందమ్మా నాలో...!స్కూల్‌కు టైం అయింది...ఇంకా లేవవేమే అని రుసరుసలాడే అమ్మ రెడీ అవమ్మా...సూ్కల్లో దింపేస్తాననే నాన్నఆ మాటే అనడం లేదు...సూ్కల్‌కు వెళ్తానంటేఈ రోజు వద్దులేమ్మా...కాసేపు పడుకో అనిసలహాలెందుకు ఇస్తున్నారో..!

సాక్షి, తూర్పుగోదావరి: ఆమెకు చదువంటే ప్రాణం.. ఆటలన్నా అంతే ఇష్టం.. అందుకే రెండింటిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే విధి ఆడిన ఆటలో ప్రస్తుతం నలిగిపోతోంది. థైరాయిడ్‌ కేన్సర్‌తో బాధపడుతోంది. తమ కుమార్తె ఆరోగ్య పరిస్థితిని చూసి కన్నతల్లిదండ్రులు కుంగిపోతున్నారు. దాతల సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. ఆమె ఆరోగ్యం బాగుండాలని దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. మరోవైపు తమ తోటి విద్యార్థి శస్త్రచికిత్స కోసం ఆ పాఠశాల విద్యార్థులు కదిలారు. తమకు తోచిన సాయం చేసే పనిలో పడ్డారు. అలాగే భవాని చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయులు కూడా తమ విద్యార్థి ఆరోగ్యం కుదుటపడేందుకు తాము కూడా సహకరిస్తామని చెబుతున్నారు

అమ్మా, నాన్నా ఏమైంది నాకు?
ఆ బాలిక మదిలో ఎన్నెన్నో ప్రశ్నలు పధ్నాలుగేళ్లకే వచ్చింది పెద్ద కష్టం ఏదో నొప్పి అని వైద్యుల చెంతకు వెళ్తేకేన్సర్‌ కాటేయబోతోందంటూ పిడుగులాంటి వార్తశస్త్ర చికిత్స, రేడియేషన్లతో నరకం తగ్గుతుందేమోననుకుంటే మరో శస్త్రచికిత్స అవసరమనే మాట ఆ చిన్నారి ఎదపై మరో పేలిన తూటానేస్తమా మేమున్నామంటూ అందించినసహ విద్యార్థుల చిరు వితరణఎక్కడ సరిపోతుందంటూ పూటగడవని ఆ కుటుంబం అర్థిస్తోంది ఆర్థిక సాయం 

గండేపల్లి మండలంలోని తాళ్లూరు జెడ్పీ స్కూల్‌లో యన్నమరెడ్డి భవాని తొమ్మిదో తరగతి చదువుతోంది. ఎంతో చలాకీగా ఉండేది. చదువు కూడా బాగా చదివేది. సెల్ఫ్‌ డిఫెన్స్‌లో భాగంగా గత ఏడాది స్కూల్లో కరాటే నేర్చుకునేది. ఈ తరుణంలో గొంతు, మెడ నొప్పి రావడంతో జగ్గంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తల్లిదండ్రులు వైద్యం చేయించారు. అయినా తగ్గకపోవడంతో రాజానగరం జీఎస్‌ఎల్‌ ఆస్పత్రిలో పిల్లల వైద్యులను సంప్రదించారు. వారి సూచనల మేరకు పరీక్షలు చేయించడంతో థైరాయిడ్‌ కేన్సర్‌ అని తేలింది. రాజమహేంద్రవరంలో ప్రైవేటు ఆస్పత్రిలో ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఎన్టీఆర్‌ వైద్యసేవ (ప్రస్తుత వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ) ద్వారా శస్త్ర  చికిత్స చేయించారు.

అది జరిగి ప్రస్తుతం 8 నెలలవుతోందని నాటి నుంచి భవానికి రేడియేషన్‌ ఇవాల్సి వస్తోందని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. గొంతు నొప్పి వస్తోందని వైద్యులను సంప్రదించడంతో వైద్యులు మరోసారి శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని అంటున్నారని దీనికి సుమారు రూ. ఐదు లక్షలు ఖర్చవుతాయంటున్నారని భవాని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో వారు దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. తమ కుమార్తె కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటోందని, కళ్లెదుటే కన్నబిడ్డ బాధను చూడలేకపోతున్నామని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. అనారోగ్యం ప్రారంభం నుంచి కూతురి కోసం తమ వద్ద ఉన్నదంతా ఖర్చు చేశామని అయినా ఆరోగ్యం కుదుట పడలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రోజువారీ కూలీ..
విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం రాజుగోపాలపురానికి చెందిన భవానీ తల్లి దండ్రులు అర్జున్‌రెడ్డి, అపర్ణలు సుమారు 17 ఏళ్లుగా తాళ్లూరులో నివాసం ఉంటున్నారు. రోజు వారి కూలీ పనులు చేసుకుంటూ వచ్చే సొమ్ములతో వీరి జీవనం సాగుతోంది. వారి కష్టార్జితంతోనే కొడుకు మణికంఠను, కూతురు భవానీని చదివించుకుంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమకు ఇంటి స్థలమైన ఇవ్వలేదని అప్పటి నుంచి అద్దె ఇంటిలో ఉంటున్నామని వాపోయారు.

ఉపాధ్యాయుల ప్రోత్సాహం
చదువు, ఆటల్లో ఉత్సాహంగా ఉండే భవానీ ఉపాధ్యాయుల మనస్సుల్లో మంచితనాన్ని సంపాదించింది. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను ఇట్టే బట్టీపట్టి అడిగిన వెంటనే ప్రశ్నలకు బదులు చెప్పేదని స్కూల్‌ హెచ్‌ఎం నాగమణి, కె.శేషారత్నం, టి.మోహిని, ఎ.సత్యనారాయణ, తదితర ఉపాధ్యాయులు చెబుతున్నారు. భవానికి అనారోగ్యమని తెలిసి వారందరూ ఆమె శస్త్ర చికిత్సకు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. 
 

నేస్తమా మేమున్నాం
నేస్తమా మేమున్నాం అంటూ తమ స్నేహితురాలి అనారోగ్యానికి తమ వంతుగా విద్యార్థులు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఉపాధ్యాయిని శ్రీవాణి సహకారంతో విద్యార్థులు ఫుడ్‌ కేంటిన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయించి తద్వారా వచ్చిన సొమ్ములు రూ.7,800 అందజేశారు. హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సభ్యుల సహకారంతో పలువురు ఆమెకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. 

మరిన్ని వార్తలు