తాడిపత్రిలో మరో వివాదం

25 Sep, 2018 11:49 IST|Sakshi

ఆశ్రమం నుంచి భక్తులను ఖాళీ చేయిస్తున్న అధికారులు

సాక్షి, అనంతపురం : ప్రబోధానంద అశ్రమం నుంచి భక్తులందరినీ ఖాళీ చేయించి.. ఆశ్రమాన్ని ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అప్పగించాలనే కుట్ర జరుగుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆధార్ కార్డులున్న భక్తులు ఆశ్రమం నుంచి వెళ్లిపోవాలంటూ అధికారులు అదేశించారు. జేసీ వర్గీయులకు, అశ్రమ నిర్వహకులకు ఇటీవల పెద్ద ఎత్తున ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఘర్షణ అనంతరం జేసీ వర్గీయులు తాడిపత్రి విడిచి వెళ్లాలని భక్తులకు వార్నింగ్‌ ఇస్తున్నారని భక్తులు వాపోతున్నారు. ప్రబోధానంద స్వామి భక్తులను అధికారులు టార్గెట్‌ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు

. స్థానికులను పంపొద్దని ఇదివరకు హైకోర్టు ఉత్తర్వులను జారీచేసినా... కోర్టు ఆదేశాలను అధికారులు పాటించట్లేదని అశ్రమ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ఆశ్రమంలో జరిగే పౌర్ణమి వేడుకలను అధికారులు రద్దు చేసి.. పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను విధించారు.

>
మరిన్ని వార్తలు