149వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం 

30 Apr, 2018 09:14 IST|Sakshi

సాక్షి, పామర్రు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. సోమవారం రాజన్న బిడ్డ చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఉదయం పామర్రు శివారు నుంచి జననేత పాదయాత్ర ప్రారంభించారు. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా వైఎస్సార్‌ సీపీ చేపట్టిన వంచన వ్యతిరేక దీక్షకు ఆయన తన మద్ధతు తెలియచేశారు.

ఈ సందర్భంగా వారికి తన సంఘీభావం తెలియచేస్తూ చేతికి నల్ల రిబ్బను కట్టుకొని వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభించారు. వేలాది మంది ఆయనతో అడుగులు వేస్తున్నారు. పాదయాత్రలో జననేత జుఝువరం, నిమ్మకూరు, నిమ్మకూరు క్రాస్‌ మీదుగా మద్దిపట్నం చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. లంచ్‌ బ్రేక్‌ తర్వాత మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. నిడుమోలు, తారకటూరు, తుమ్మలపాలెం క్రాస్‌ మీదుగా పర్ణశాల చేరుకొని పాదయాత్ర ముగిస్తారు రాత్రికి అక్కడే బస చేస్తారు.

మరిన్ని వార్తలు