నూజివీడు ట్రిపుల్‌ ఐటీ సంచలన నిర్ణయం

18 Sep, 2017 16:05 IST|Sakshi
నూజివీడు ట్రిపుల్‌ ఐటీ సంచలన నిర్ణయం

కృష్ణా : నూజివీడు ట్రిపుల్‌ ఐటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ర్యాగింగ్‌కు పాల్పడ్డ మొత్తం 54 మంది విద్యార్థులపై సస్పెన్షన్‌ విధించారు. వీరిలో 15 మంది విద్యార్థులపై ఏడాది పాటు, ఆరుగురిపై శాశ్వతంగా వేటు పడింది. 'తలెత్తుకుని ఎందుకు వెళ్తున్నావు.. ఫోన్ లో వాట్సాప్ ఎందుకు వాడటం లేదు. కొడితే ఏడుస్తావా?.. ఇవన్నీ బయటకు చెబితే ప్రాణాలు తీస్తామంటూ' ట్రిఫుల్ ఐటీలోని నాల్గో సంవత్సరం విద్యార్థులు థర్డ్ ఇయర్ విద్యార్థులను బెదిరించిన తీరిది.

దీంతో పాటు క్రమశిక్షణ కమిటీ సభ్యులకు ఈ3 కి చెందిన కొందరు విద్యార్థులు ఇన్ఫార్మర్లుగా ఉన్నారని ద్వేషం పెంచుకున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులు గత నెల 29న అర్ధరాత్రి దాటిన తర్వాత 20 మందికి పైగా జూనియర్లను ఒక్కొక్కరినీ గదిలోకి రప్పించి కొట్టి బయటకు పంపించడం కలకలం రేపింది. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ జూనియర్లు భయంతో కాలేజీని వదిలిపెట్టేందుకు సిద్దపడ్డారు. దీంతో ర్యాగింగ్‌ ఘటన పై ప్రత్యేక కమిటీని నియమించారు. దర్యాప్తులో సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారని తేలడంతో  మొత్తం 54 మంది విద్యార్థులపై సస్పెన్షన్‌ విధించారు.