15 వేల ఎకరాల భూపంపిణీ

28 Dec, 2013 04:12 IST|Sakshi

 సత్తుపల్లి టౌన్, న్యూస్‌లైన్ : ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో 15 వేల ఎకరాల భూమి పంపిణీ చేసినట్లు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ తెలిపారు. సత్తుపల్లిలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో 568 మంది లబ్ధిదారులకు 711.25 ఎకరాలకు సంబంధించిన పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి పొందిన వారికి రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాం కర్లతో సమావేశాలు నిర్వహించామన్నారు.

వచ్చే ఖరీఫ్‌లో రుణాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఇందిర జలప్రభ ద్వారా కూడా ఈ భూముల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని తెలిపారు. రోడ్లపై ఫుల్‌వీల్స్‌తో ట్రాక్టర్లు తిరగటంతో రోడ్లు మరమ్మతులకు గురవుతున్నాయని, అలా తిరగకుండా ఉండేందుకు జిల్లాస్థాయిలో అధికారులతో సమావేశాలు ఏ ర్పాటు చేసి చర్యలు చేపడతామని వివరించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సత్తుపల్లిలో భూమిని గుర్తించామని, త్వరలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. రచ్చబండలో వచ్చిన సమస్యలన్నీ ఆన్‌లైన్ చేసి పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

 ఈ నెలాఖరులోగా వికలాంగుల శిబిరా లు పూర్తి అవుతాయని, 20 నుంచి 40 శాతం ఉన్న వికలాంగులకు కూడా పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నిరుపేదలకు భూమిపై హక్కులు కల్పించటం శుభ పరిణామన్నారు. సత్తుపల్లి మండలం యాతాలకుంటలో గిరిజనులకు, అటవీ శాఖకు మధ్య భూ వివాదం సాగుతోందని, దీనిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ సంజీవరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, తహశీల్దార్లు జి.నర్సింహారావు, అమర్‌నాథ్, సాంబశివరావు, వెంకటేశ్వరరావు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అఖిలపక్ష భేటీ: ఢిల్లీ చేరుకున్న వైఎస్‌ జగన్‌

బీపీఓలను గ్రామస్థాయికి విస్తరిస్తాం : మంత్రి గౌతమ్‌రెడ్డి

వీరింతే.... మారని అధికారులు

ఉపాధ్యాయుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

‘మృగశిర’ మురిపించేనా!

ర్యాగింగ్‌ చేస్తే...

డీఎస్సీ–18 అభ్యర్థులకు శుభవార్త

జాదూగర్‌ బాబు చేశారిలా..

ట్రాన్స్‌ఫార్మర్‌ అడ్డొచ్చిందని..!

అన్నిచేసి.. ఇప్పుడేమో నంగనాచి డ్రామాలు

ఆయుష్షు హరించారు!

తాగి ఊదితే...  ఊచల వెనక్కే!

ఒత్తిడి నుంచి ఉపశమనం..

కోడెల తనయుడి మరో నిర్వాకం

అధికారులు పరువు తీస్తున్నారు!

ఎట్టకేలకు ఆ డీఎస్సీకి మోక్షం!

బెల్టు తీయాల్సిందే

కొత్తది ఉన్నా ఇంకా పాతదానిలోనే..

అసెట్‌.. అడ్మిషన్లు ఫట్‌!

తింటే తంటాయే! 

లెక్క తేలాల్సిందే!

కోడెల వ్యవహారంపై టీడీపీ కీలక నిర్ణయం!

నాడు ఆధ్యాత్మిక గురువు.. నేడు అనాథ

ఏటీఎం@ మోసం

ఈ భోజనం మాకొద్దు

సీఎం ప్రకటనతో సంజీవనికి ప్రాణం

మగబిడ్డ పుట్టాడని ఆనందం..కానీ అంతలోనే

ఇక రిజర్వేషన్ల కుస్తీ..!

పట్టాలెక్కని సౌకర్యాలు 

దారుణం : 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రభాస్‌ నెక్ట్స్ ఎవరితో..?

రాజ్‌ తరుణ్‌ కొత్త సినిమా ప్రారంభం

‘సంపూ’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే!

రెక్కల సివంగి

ఏడేళ్లుగా ఇదే ఫిట్‌నెస్‌తో ఉన్నా!

ఫ్లాప్ డైరెక్టర్‌తో సాయి ధరమ్‌ తేజ్‌!