జిల్లాకు 168 క్రషీ కేంద్రాలు

21 Aug, 2014 00:39 IST|Sakshi
జిల్లాకు 168 క్రషీ కేంద్రాలు
  •    త్వరలో ప్రారంభం
  •      కార్యకర్తల నియామకం
  •      జిల్లా మహిళా,శిశు అభివృద్ధి సంస్థ సన్నాహాలు
  • విశాఖపట్నం : జిల్లాకు రాష్ట్ర మహిళా,శిశు సంక్షేమశాఖ 168 బాలల సంరక్షణ(క్రషీ) కేంద్రా లు మంజూరు చేసింది. ఈ మేరకు జిల్లా మహిళా,శిశు అభివృద్ధి సంస్థ కార్యాలయానికి బుధవారం ఉత్తర్వులు వచ్చాయి. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలలో ఇవి ఏర్పాటవుతాయి. అంగన్‌వాడీ కేంద్రాల మాదిరి ఉంటాయి. ఆరు నెలల నుంచి ఆరేళ్లలో పు వయస్సు ఉన్న పిల్లలకు వీటిల్లో ప్రవేశం కల్పిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాలు లేని చోట, తల్లిదండ్రులు పనుల్లోకి వెళ్లే ప్రాంతాలలో ఎక్కువగా ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

    పిల్ల ల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ఇవి పనిచేస్తాయి. పదో తరగతి పాసయి, 21 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉన్న మహిళలను కార్యకర్తలుగా నియమిస్తారు. వీరికి రూ.3వేల వేతనం ఇస్తారు. జిల్లాలో 22 ఐసీడీఎస్ ప్రాజెక్టులు వున్నాయి. అరకు ప్రాజెక్టుకి 15, డుంబ్రిగుడకు 16, పెదబయలుకి 15, కొయ్యూరుకి 15, చిం తపల్లికి 16, జి.మాడుగులకు 15, జీకేవీథికి 15, పాడేరుకి 13, హుకుంపేటకు 17, అనంతగిరికి 16, ముంచంగిపుట్టుకు15 కేంద్రాలు వంతున మంజూరయ్యాయి. జిల్లాలో ముఖ్యంగా ఉపా ధి హామీ పథకం పనుల్లోకి ఎక్కువగా మహిళ లు వెళ్లే ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఒక కేంద్రంలో ఎంతమంది పిల్లలకైనా ప్రవేశం కల్పిస్తారు.
     

మరిన్ని వార్తలు