జిల్లాకు 1719 మంది న్యూట్రిషన్ కౌన్సెలర్లు

30 Nov, 2014 02:27 IST|Sakshi

వీరఘట్టం:జిల్లాలో అన్న అమృతహస్తం పథకం అమలుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా న్యూట్రిషన్ కౌన్సెలర్ పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో 18 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా ఈ పథకం అమలవుతున్న వీరఘట్టం, పాలకొండ, సీతంపేట, కొత్తూరు, మందస, సారవకోట, ఇచ్ఛాపురం రూరల్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1719 న్యూట్రిషన్ కౌన్సెలర్ పోస్టులు మంజూరయ్యాయి.  ఈ నియామకాలకు ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ కానుంది.
 
 ఇవీ న్యూట్రిషన్ కౌన్సెలర్ విధులు
 అంగన్‌వాడీ కార్యకర్తల మాదిరిగానే న్యూట్రిషన్ కౌన్సిలర్ విధులు నిర్వహిస్తారు. గర్భిణులు, బాలింతలకు కేంద్రాల ద్వారా సక్రమంగా పౌష్టికాహరాన్ని అందించడం, కేంద్రాలకు రాలేని జిల్లాకు 1719 మంది న్యూట్రిషన్ కౌన్సెలర్లు
 గర్భిణుల ఇళ్లకు వెళ్లి సలహాలు, సూచనలు ఇచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు చేయించుకునేలా అవగాహన కల్పించడం, ప్రమాదాల్లో ఉన్న మహిళలు, పిల్లలకు సహయసహకారాలు అందించడం వంటి పనులు చేయాలి. అంగన్‌వాడీ కార్యకర్తల్లాగే వీరికీ గౌరవ వేతనం(జీతం) ఉంటుంది.
 
 కమిటీల ద్వారా ఎంపిక
 కౌన్సెలర్లను కూడా ఎమ్మెల్యే, ఆర్డీవోలు నియోజకవర్గాల వారీగా ఎంపిక చేస్తారు. పదో తరగతి పాసైన స్థానిక మహిళలు ఈ పోస్టులకు అర్హులు. జిల్లాలోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 1261 ప్రధాన, 458 మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో వీరిని నియమిస్తారు.
 ప్రాజెక్టులు.. పోస్టులు : వీరఘట్టం.. 160, పాలకొండ.. 175, సీతంపేట.. 231, కొత్తూరు.. 264, మందస.. 275, సారవకోట.. 303, ఇచ్ఛాపురం రూరల్.. 311.
 
 రెండు రోజుల్లో నోటిఫికేషన్
 అంగన్‌వాడీ కేంద్రాల్లో న్యూట్రిషన్ కౌన్సెలర్ పోస్టుల భర్తీకి రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం.  ఆర్డీవో కార్యాలయాల నుంచి నోటిఫికేషన్ జారీ చేస్తారు. అలాగే పలాస, కోటబొమ్మాళి ప్రాజెక్టుల్లో అన్న అమృతహస్తం పథకం అమలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.
 - పి. చక్రధర్, ఐసీడీఎస్ పీడీ
 

మరిన్ని వార్తలు