18 బైకుల దొంగ అరెస్టు

25 May, 2014 02:43 IST|Sakshi
18 బైకుల దొంగ అరెస్టు

పాతపట్నం, న్యూస్‌లైన్: శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో బైకు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పాతపట్నం పోలీసులు శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అపహరించిన 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు పాలకొండ డీఎస్పీ శనివారం నిందితుడి వివరాలను వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం వివరాలు... విశాఖపట్నం శాలిగ్రమపురం గ్రామానికి చెందిన కొట్లాన కనకరాజు అనే వ్యక్తి పాతపట్నం మండలం గంగువాడ గ్రామంలో ఓ యువతిని వివాహం చేసుకున్నాడని డీఎస్పీ దేవానంద్ శాంతో చెప్పారు. కాగా కనకరాజు వృత్తిరీత్యా కారు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. అతడు ఇటీవల పాతపట్నం వచ్చాడు.
 
 పభాకర్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం రోడ్డుపై ఉండగా అపహరించాడు. దీంతో ప్రభాకర్ పాతపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు శుక్రవారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న కనకరాజును అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో కనకరాజు వెల్లడించిన నిజాలకు పోలీసులు సైతం నివ్వెరపోయారు. విశాఖపట్నంలో 10, శ్రీకాకుళం, టెక్కలి, పాతపట్నం పట్టణాల్లో 8 ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు కనకరాజు వెల్లడించాడు. వృత్తిరీత్యా కనకరాజు కారు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. కనకరాజు కేవలం ఫ్యాషన్ ప్లస్ వాహనాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడినట్లు డీఎస్పీ వెల్లడించారు. చోరీ చేసిన 18 వాహనాల్లో 12 వాహనాలు అవే కావడం విశేషం. సీఐ జె.శ్రీనివాసరావు, ఎస్సై బి.సురేష్ ఆధ్వర్యంలో క్రైం పార్టీ మాధవ, ఉమ, మల్లేష్, లక్ష్మణ్‌లు కేసు ఛేదించినట్లు డీఎస్పీ  తెలిపారు.
 

మరిన్ని వార్తలు