విభజన కలతతో 18 మంది మృతి

5 Oct, 2013 03:19 IST|Sakshi

న్యూస్‌లైన్ నెట్‌వర్‌‌క : రాష్ట విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందన్న వార్తలతో కలత చెంది 18 మంది మృత్యువాత పడ్డారు.  వీరిలో 17 మంది గుండెపోటుతో మరణించగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం గానుగచింతకు చెందిన కె.కృష్ణయ్య(55), పుంగనూరులో అన్సర్‌ఖాన్(39), తవణంపల్లె మండలం ఎగుమత్యంకు చెందిన సి.రవి(47), కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం చింతలపాడులో ప్రసాద్(50), విస్సన్నపేట మండలం చండ్రుపట్లలో వెంకటేశ్వరరావు(58), కలిదిండి మండలం మద్వానిగూడెంలో జోసఫ్(52) గుండెపోటుతో మరణిం చారు.
 
 ఇంకా అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లికి చెందిన రత్నమయ్య, గుంటూరు జిల్లా ఖాజీపాలెంలో శ్రీనివాసరావు(42), గుంటూరులోని జొన్నలగడ్డ కు చెందిన సాంబిరెడ్డి(65), విశాఖ జిల్లా పాపయ్యసంతపాలెంలో కె. కొండలరావు(64), వైఎస్సార్ జిల్లా  బద్వేలుకు చెందిన వెంకటేశ్వర్లు(40) మరణించిన వారిలో ఉన్నారు. అలాగే, శ్రీకాకుళం జిల్లా లావేరుకు చెందిన  సత్యం(60), రాజాంకు చెందిన అమ్మన్నమ్మ(52), కర్నూలు జిల్లా నంద్యాల కు చెందిన శ్రీనివాసులు(32), బనగానపల్లె మండలం వెంకటాపురానికి చెందిన మస్తాన్(40), పత్తికొండ మండల పరిధిలోని జూటూరులో కాశయ్య(53)లు మరణించారు.
 
 ప్రభుత్వోద్యోగి ఆత్మబలిదానం : ఓ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి శుక్రవారం ఆత్మబలిదానం చేసుకున్నాడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తహశీల్దారు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న అచ్యుతాన బాపయ్య(50) ఓలాడ్జి గదిలో ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు.   విషయం తెలుసుకున్న పోలీసులు ఆయన్ను 108 వాహనంలో  ప్రభుత్వాస్పత్రికి తరలించగా..  చికిత్స పొందుతూ మరణించారు.  
 
 దీక్ష చేస్తూ వైఎస్సార్ సీపీ నేత మృతి :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గిడ్డి దివాకర్(55) రాష్ట్ర విభజనకు నిరసనగా దీక్ష చేస్తూ మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం గిడ్డివారిపేటకు చెందిన దివాకర్ ముమ్మిడివరంలో రిలేదీక్షకు దిగారు. శుక్రవారం దీక్షా శిబిరంలోనే కుప్పకూలిపోయారు. ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలొదిరారు.

మరిన్ని వార్తలు