ఏపీలో మరో 1919 కరోనా కేసులు..

13 Jul, 2020 17:23 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా1,919  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 13 మంది, విదేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో 1030 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు రాష్ట్ర్రంలో మొత్తం 16,464 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. (‘మానవ చరిత్రలో ఇదే అత్యంత భారీ సంక్షోభం’)

గత 24 గంటల్లో కరోనా బారిన పడి అనంతపురంలో ఆరుగురు, కర్నూలులో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు,కృష్ణాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, కడపలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు.. శ్రీకాకుళం,విశాఖపట్నం,విజయనగరంలో ఒక్కరు చొప్పున  మొత్తం 37 మంది మరణించారు. ఇప్పటి వరకు  రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకి మొత్తం 365 మంది మృతిచెందారు.గత  24 గంటల్లో 19,247 శాంపిల్స్‌ను పరీక్షించగా, ఇప్పటివరకు ఏపీలో 11,73,096 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య మొత్తం 31,103కు చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం 14,274 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. (బాలీవుడ్‌లో క‌రోనా క‌ల‌క‌లం!)


 

>
మరిన్ని వార్తలు